MS Dhoni : బంగ్లా ఆటగాళ్లను అలా బోల్తాకొట్టించా.. బంగ్లాతో మ్యాచ్ లో ఫన్నీ సన్నివేశాన్ని వివరించిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్

నేను క్రికెటర్ గా ఎదగడానికి ముందు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశాను. ఈ కారణంగా నాకు బెంగాలీ భాష వచ్చు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ కు ఆ విషయం తెలియదు..

MS Dhoni

MS Dhoni Pranked Banglades: టీమిండియాను ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానంలో నిలిపిన కెప్టెన్లలో మొదటి వరుసలో మహేంద్ర సింగ్ ధోనీ పేరు ఉంటుంది. కెప్టెన్ కూల్ గా పేరుగడించిన ధోనీ తన వ్యూహాలతో భారత్ జట్టును అనేక సందర్భాల్లో విజయతీరాలకు చేర్చాడు. ధోనీ హయాంలో వరల్డ్ కప్ తో పాటు మూడు ఫార్మాట్లలో అనేక ఐసీసీ టైటిళ్లు, ట్రోపీలను టీమిండియా గెలుచుకుంది. ధోనీ మైదానంలో, బయట సరదాగా ఉంటాడు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఓ ఫన్నీసన్నివేశాన్ని వెల్లడించారు.

Also Read : AP Latest News : విజయనగరానికి నారా భువనేశ్వరి.. ఈరోజు ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ఇలా తెలుసుకోండి ..

నేను క్రికెటర్ గా ఎదగడానికి ముందు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశాను. ఈ కారణంగా నాకు బెంగాలీ భాష వచ్చు. ఆ తరువాత కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తరువాత బెంగాలీ మాట్లాడటం మర్చిపోయాను. అయితే, ఆ భాష నాకు అర్థమవుతుంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా ‘నాకు బెంగాలీ అర్థం అవుతుందని వారికి తెలియదు’ నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లా వికెట్ కీపర్ బౌలర్ కు బెంగాలీలో బాల్ ఎలా వేయాలో సూచనలు చేస్తున్నాడు. దీంతో బౌలర్ ఏ బాల్ వేస్తాడో నాకు ముందే తెలిసిపోయేది. దీంతో పరుగులు చేయడం సులువుగా మారింది. అయితే, మ్యాచ్ తరువాత బంగ్లా ప్లేయర్స్ ధోనీ బెంగాలీ అర్థం చేసుకోగలడని తెలిసి ఆశ్చర్యపోయాంటూ ధోనీ చమత్కరించాడు.

Also Read : AFG vs SL : మ‌రో సంచ‌ల‌నం.. శ్రీలంక పై అఫ్గానిస్థాన్ విజ‌యం.. సెమీస్ రేసులోకి దూసుకు వ‌చ్చిన‌ అఫ్గాన్‌.. లంక అవ‌కాశాలు సంక్లిష్టం..!

2019 ఐసీసీ ప్రపంచ కప్ తరువాత ఎం.ఎస్. ధోనీ భారత్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్ లో తన ప్రస్థానం కొనసాగుతోంది. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పలుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. 2023లో ఐపీఎల్ ట్రోపీనిసైతం ధోనీ నాయకత్వంలో సీఎస్ కే జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.