Malti Chahar Hilarious Instagram Story Sparks Laughter After CSK vs MI Clash
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై తరుపు దీపక్ చాహల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు.
తొలుత బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్ రేటు 186.67 గా ఉండడం విశేషం. ఆ తరువాత బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసిన అతడు 18 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.
Malti Chahar’s Instagram story. pic.twitter.com/1bfxj4kcU4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
కాగా.. మ్యాచ్ అనంతరం అతడి సోదరి మాలతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన కెరీర్‌లో దీపక్ చాహర్ ఏడేళ్ల పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పాత జట్టుకు వ్యతిరేకంగా ఆడినందుకు తన సోదరుడిని హాస్యాస్పదంగా ట్రోల్ చేసింది. కట్టప్పతో పోల్చింది.
ముంబై తరుపున బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన దీపక్ చాహర్ ఫోటోలతో పాటు బాహుబలి మూవీలోని వెన్నుపోటు పొడిచే సన్నివేశానికి సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆ పిక్‌తో పాటు నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది.
Nitish Kumar Reddy : మ్యాచ్ మధ్యలో పెళ్లి పై స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్..
2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు దీపక్ చాహర్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2025 మెగావేలానికి ఆ జట్టు అతడిని విడిచిపెట్టింది. వేలంలో అతడి కోసం కాస్త గట్టిగానే పోరాడింది. అయితే.. ముంబై ఇండియన్స్ రూ.9.25 కోట్లకు దీపక్ చాహర్‌ను సొంతం చేసుకుంది.