Manu Bhaker Gukesh Among Four Athletes To Get Dhyan Chand Khel Ratna Award
భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నపురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డబుల్ ఒలింపిక్ పతక విజేత షూటర్ మనుభాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ గుకేశ్, పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌లకు ఖేల్‌రత్న అవార్డులు వరించాయి. 17 మంది పారా అథ్లెట్లుసహా 32 మందికి అర్జున అవార్డులు దక్కాయి. జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను పేరు లేదు అని కొన్ని కొత్త రిపోర్టులు చెప్పడంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మను భాకర్ తండ్రి రామ్ కిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మను ను షూటర్‌ని కాకుండా క్రికెటర్‌ని చేసి ఉంటే బాగుండేదని అన్నాడు. అప్పుడు అవార్డులు, ప్రశంసలు అన్నీ వచ్చేవని అన్నాడు.
IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..
ఒలింపిక్స్‌లో ఆడినా మన దేశంలో విలువ ఉండదని, రెండు పతకాలు సాధించినప్పటికి ఖేల్ రత్న పురస్కారానికి మను ను పట్టించుకోవడం లేదన్నారు. దేశం కోసం మను ఇంకా ఏమీ చేయాలని ఆశిస్తున్నారు అంటూ ఖేల్ రత్న నామినీల జాబితాను ఖరారు చేసిన కమిటీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం కోసం విజయాలు సాధిస్తున్నప్పటికి గుర్తింపు కోసం అడుక్కోవాల్సి రావడంలో అర్థం లేదన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా పదశ్రీ, పద్మ విభూషణ్, ఖేల్ రత్న వంటి పురస్కారాల కోసం మను దరఖాస్తు చేసుకుందని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఆమె దరఖాస్తు చేసుకోకపోయినా.. ఆమె సాధించిన ఘనతలు చూసి కమిటీ ప్రతిపాదించాల్సిందన్నారు.
ఇక ఇప్పుడు మను భాకర్ ఖేల్ రత్న అవార్డు రావడంతో అన్ని వివాదాలు ముగిసిపోయినట్లే.
Ministry of Youth Affairs and Sports announces the Khel Ratna Award for Olympic double medalist Manu Bhaker, Chess World Champion Gukesh D, Hockey team Captain Harmanpreet Singh, and Paralympic Gold medallist Praveen Kumar. pic.twitter.com/VD54E0EtEk
— ANI (@ANI) January 2, 2025