Manubhaker : నీరజ్ చోప్రా పోస్టుకు మనుబాకర్ రియాక్షన్.. పెళ్లెప్పుడంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్ల

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024 సీజన్ ను డైమండ్ లీగ్ ఫైనల్ తో ముగించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

Manubhaker : నీరజ్ చోప్రా పోస్టుకు మనుబాకర్ రియాక్షన్.. పెళ్లెప్పుడంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్ల

Neeraj chopra and Manubhaker

Updated On : September 16, 2024 / 10:14 AM IST

Manubhaker – Neeraj chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024 సీజన్ ను డైమండ్ లీగ్ ఫైనల్ తో ముగించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. సీజన్ ముగిసిన తరువాత నీరజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు.. తన చేతికి గాయమైందని చెప్పాడు. అందుకు సంబంధించిన ఎక్స్ రే ఫొటోను కూడా పోస్టు చేశాడు. అంతేకాక.. సీజన్ ముగింపుకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ అని ప్రకటించాడు. ట్రాక్ పై నిలబడే సీజన్ ను ముగించాలనుకున్నా.. నా సొంత అంచనాలను అందుకోలేక పోయినా ఈ సీజన్ లో ఎంతో నేర్చుకున్నా. పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి కొత్త సీజన్ లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్నాను. నన్ను మరింత మెరుగైన అథ్లెట్ గా, వ్యక్తిగా 2024 మర్చింది.. 2025లో కలుద్దా అని నీరజ్ పేర్కొన్నారు. నీరజ్ చోప్రా పోస్టుకు ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ స్పందించారు.

Also Read : Amala Paul : ఫ్యామిలీతో అమలాపాల్ ఓనమ్ సెలబ్రేషన్స్.. మొదటిసారి కొడుకు ఫేస్ రివీల్.. ఫొటోలు వైరల్..

2024 ను అద్భుతంగా ముగించిన నీరజ్ చోప్రాకు అభినందనలు.. త్వరగా గాయం నుంచి కోలుకోవాలని, రానున్న ఏళ్లలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు. మనుబాకర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మను బాకర్ పోస్టుపై వింత ప్రశ్నలు సంధిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. పెళ్లి గంట మోగుతుంది అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య బంధం చూస్తుంటే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోందంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా నెటిజన్లు నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Also Read : India Vs Bangladesh : టీ20 సిరీస్‌ నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ ఔట్..! ఇషాంత్ కిష‌న్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున నీరజ్ చోప్రా, మను భాకర్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఒలింపిక్స్ సమయంలో వారిద్దరూ సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనికితోడు మనుబాకర్ తల్లి నీరజ్​తో సన్నిహితంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరలైంది. దీంతో నీరజ్, మనుల మధ్య ప్రేమ వార్తలకు బలంచేకూరినట్లఅయింది. గతంలో దీనిపై మను బాకర్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా గురించి మను బాకర్ చాలా గొప్పగా అభివర్ణించారు. అతడు చాలా మందికి స్ఫూర్తిదాతగా నిలిచాడని ప్రశంసించింది. దీంతో మళ్లీ వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చర్చ జరుగుతుంది. తాజా నీరజ్ చోప్రా పోస్టుకు మనుబాకర్ స్పందించడంతో వారి పెళ్లిపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.