Matthew Forde equals AB de Villiers record in Ireland mauling
వన్డేల్లో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ సమం చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేల్లో మాథ్యూ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన డివిలియర్స్ సరసన నిలిచాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న మాథ్యూ ఫోర్డ్ 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు.
RCB vs SRH : ఆర్‌సీబీ పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కామెంట్స్.. ఆలస్యమైంది కానీ..
వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్లు వీరే..
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 16 బంతులు – 2015లో వెస్టిండీస్ పై
మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్) – 16 బంతులు – 2025లో ఐర్లాండ్ పై
సనత్ జయసూర్య (శ్రీలంక) – 17 బంతులు – 1996లో పాకిస్తాన్ పై
కుశాల్ పెరీరా (శ్రీలంక) – 17 బంతులు – 2015లో పాకిస్తాన్ పై
మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) – 17 బంతులు – 2015లో శ్రీలంక పై
లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్) – 17 బంతులు – 2015లో నెదర్లాండ్స్ పై
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కీసీ కార్టీ(102; 109 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్) శతకంతో చెలరేగగా, మాథ్యూ ఫోర్డ్ (58) మెరుపులు మెరిపించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ మూడు వికెట్లు తీశాడు. జోష్ లిటిల్, బార్రీ మెక్‌కార్తీ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం మొదలైంది. ఎంతసేపటికి తగ్గలేదు. ఫలితంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి వన్డేలో ఐర్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వన్డేలు ముగిసే సరికి ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
MATHEW FORDE EQUALLED AB DE VILLIERS’ FASTEST ODI FIFTY RECORD.
– A half century in 16 balls. 🤯pic.twitter.com/sxD2EpLX9P
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 23, 2025