David Miller
David Miller hundred : దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన మొదటి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచులో మిల్లర్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మిల్లర్ 115 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతకముందు 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ పై ఫాఫ్ డు ప్లెసిస్ చేసిన 82 పరుగులే అత్యుత్తమం.
ప్రపంచ కప్ నాకౌట్‌లలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేసిన అత్యధిక పరుగులు..
డేవిడ్ మిల్లర్ – 101 పరుగులు ఆస్ట్రేలియా పై కోల్‌కతా 2023 సెమీ పైనల్
ఫాఫ్ డుప్లెసిస్ – 82 పరుగులు న్యూజిలాండ్ పై 2015 సెమీ పైనల్
క్వింటన్ డికాక్ – 78* పరుగులు శ్రీలంక పై 2015 క్వాలిఫైయిడ్ మ్యాచ్
PM Narendra Modi : ప్రపంచకప్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!
ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ 116 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో వచ్చి చేరాయి.
David Miller celebrates his century
ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు..
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడిన మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు జాబితాలో డేవిడ్ మిల్లర్ చోటు దక్కించుకున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్, డేవిడ్ వార్నర్ లు చెరో ఐదు సెంచరీలు చేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా డికాక్, గిబ్స్, మిల్లర్ తలా మూడు శతకాలు బాది రెండో స్థానంలో నిలిచారు.
ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా) – 5 సెంచరీలు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 5 సెంచరీలు
క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 3 సెంచరీలు
హెర్షెల్ గిబ్స్ (సౌతాఫ్రికా) – 3 సెంచరీలు
డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా) – 3 సెంచరీలు
వన్డేల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు..
వన్డేల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు మిల్లర్. ఈ క్రమంలో జాక్వెస్ కలిస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Hardik Pandya : సరైన సమయంలో గాయపడిన హార్ధిక్‌పాండ్య ..! కృతజ్ఞతలు తెలుపుతున్న నెటిజన్లు..
ఏబీ డివిలియర్స్ – 200 సిక్స్‌లు
డేవిడ్ మిల్లర్ -138 సిక్స్‌లు
జాక్వస్ కలిస్ – 137 సిక్స్‌లు
హెర్షల్ గిబ్స్ – 128 సిక్స్‌లు
క్వింటన్ డికాక్ – 118 సిక్స్‌లు
ప్రపంచ కప్‌లలో నం5 స్థానంలో అత్యధిక శతకాలు..
ప్రపంచకప్‌లలో నం5 స్థానంలో లేదంటే అంతకంటే ఎక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మాక్స్‌వెల్ మూడు శతకాలు చేయగా, మిల్లర్ రెండు సెంచరీలు చేశాడు.