Mirabai Chanu wins Silver medal at World Weightlifting Championships 2025
Mirabai Chanu : ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను సత్తా చాటింది. నార్వేలోని ఫోర్డ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో మీరాబాయి రజత పతకాన్ని గెలుచుకుంది. మహిళల 48 కిలోల విభాగంలో తృటిలో గోల్డ్‌మెడల్‌ను మిస్సైంది.
మీరాబాయి చాను (Mirabai Chanu) మొత్తం 199 కిలోల( స్నాచ్ లో 84 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు) బరువు ఎత్తింది. ఉత్తరకొరియాకు చెందిన రి సాంగ్-గమ్ 213 కిలోలు ఎత్తి ప్రపంచ రికార్డు సాధించడంతో పాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన థాన్యాథాన్ సుక్చారోన్ (198 కిలోల బరువు ) కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది.
Nashra Sandhu : ఇలా ఔట్ కావడం పాక్ ప్లేయర్లకే సాధ్యం.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా లేక..
2017లో కాలిఫోర్నియాలోని అనహీమ్‌లో జరిగిన ఎడిషన్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత, చాను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తిరిగి పోడియంకు చేరుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. గత సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆమె పాల్గొన్న రెండవ అతి పెద్ద టోర్నమెంట్ ఇదే. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా చాను 199 కిలోల బరువును (49 కిలోల విభాగంలో 88 కిలోల స్నాచ్ + 111 కిలోల క్లీన్ అండ్ జెర్క్) ఎత్తింది. అయితే.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
Mirabai Chanu wins SILVER🥈 at the 2025 Weightlifting World Championships with this 115kg (253lbs) clean & jerk! pic.twitter.com/BCnx1v9RUY
— Squat University (@SquatUniversity) October 2, 2025
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే ఛాను ఇప్పటి వరకు 14 అంతర్జాతీయ పతకాలను సాధించింది. 2016 దక్షిణాసియా క్రీడల్లో ఓ స్వర్ణం, 2020 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒక కాంస్య పతకం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు (2018, 2022లో స్వర్ణం, 2014లో రజతం), కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లలో అయిదు (నాలుగు స్వర్ణాలు, ఒక రజతం) ఉన్నాయి.