Nashra Sandhu : ఇలా ఔట్ కావ‌డం పాక్ ప్లేయ‌ర్ల‌కే సాధ్యం.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా లేక..

పాకిస్తాన్ బ్యాట‌ర్ నష్రా సంధు (Nashra Sandhu) ఔటైన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Nashra Sandhu : ఇలా ఔట్ కావ‌డం పాక్ ప్లేయ‌ర్ల‌కే సాధ్యం.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందా లేక..

CWC25 Nashra Sandhu hit wicket dismissal video viral

Updated On : October 3, 2025 / 10:54 AM IST

Nashra Sandhu : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు బ్యాట‌ర్లు విచిత్ర రీతిలో ఔట్ కావ‌డాన్ని చూస్తూనే ఉంటాం. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా శ్రీలంక జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ నష్రా సంధు (Nashra Sandhu) అసాధార‌ణ రీతిలో హిట్ వికెట్‌గా ఔటైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గురువారం కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం వేదిక‌గా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 35 ఓవ‌ర్‌ను బంగ్లా బౌల‌ర్‌ షోర్నా అక్త‌ర్ వేసింది. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని పుల్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించింది. ఈ బంతిని ఆడేందుకు నష్రా సంధు ప్ర‌య‌త్నించింది. అయితే.. ఆఖ‌రి క్ష‌ణంలో షాట్ ఆడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని త‌న బ్యాట్‌ను వెన‌క్కి తీసుకుంది. ఈ క్ర‌మంలో బ్యాట్ వికెట్ల‌ను తాక‌డంతో బెయిల్స్ కింద‌ప‌డ్డాయి. దీంతో న‌ష్రా సంధు హిట్ వికెట్‌గా ఔట్ అయింది.

Jasprit Bumrah : క‌పిల్‌దేవ్‌, ఇషాంత్ శ‌ర్మ‌, ష‌మీల రికార్డులు బ్రేక్‌.. కానీ.. ఆ ఒక్క‌డిని అధిగ‌మించ‌లేక‌పోయిన బుమ్రా..

కాగా.. పురుషుల క్రికెట్‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. గ‌తంలో పాక్ ఆట‌గాళ్లు మిస్బా-ఉల్-హక్, ఇమామ్-ఉల్-హక్ లు ఇలాగే ఔట్ అయ్యారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 38.3 ఓవ‌ర్ల‌లో 129 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో రమీన్ షమీ (23), కెప్టెన్ ఫాతిమా సనా (22) ప‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారు దారుణంగా విఫ‌లం కావ‌డంతో పాక్ త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. బంగ్లా బౌల‌ర్ల‌లో షోర్నా అక్త‌ర్ మూడు వికెట్లు తీయ‌గా, నహిదా అక్తర్, మరుఫా అక్తర్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత రుబియా హైద‌ర్ (54 నాటౌట్; 77 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా, నిగర్ సుల్తానా (23), శోభన మోస్టరీ (24 నాటౌట్) రాణించ‌డంతో 130 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ జ‌ట్టు 31.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.