Australia : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్లుగా డేంజ‌ర‌స్‌ ప్లేయ‌ర్లు.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లే..

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చినెల‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది.

Mitchell Marsh to open with Travis Head at the 2026 T20 World Cup

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చినెల‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీకి మ‌రో ఐదు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో ఈ మెగాటోర్నీలో త‌మ ఓపెనింగ్ జోడిని ఆస్ట్రేలియా ఖ‌రారు చేసింది. ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌, ట్రావిస్ హెడ్‌లు ఓపెన‌ర్లుగా రానున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మిచెల్ మార్ష్ వెల్ల‌డించాడు.

తాను హెడ్ తో క‌లిసి టీ20ల్లో ఓపెనింగ్ చేస్తాన‌ని చెప్పాడు. తామిద్ద‌రం ఎన్నో మ్యాచ్‌లు క‌లిసి ఆడామ‌న్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొప్ప అనుబంధం ఉంద‌న్నాడు. ద‌క్షిణాఫ్రికాతో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు మిచెల్ మార్ష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

Ashwin-Sanju Samson : ట్రేడ్ రూమ‌ర్స్‌ వేళ‌.. ‘నేను కేర‌ళ‌లో ఉండి నువ్వు చెన్నైకి వెళితే..’ సంజూ శాంస‌న్‌తో అశ్విన్‌..

అటు వ‌న్డేల్లో ట్రావిస్ హెడ్‌-మిచెల్ మార్ష్ జోడికి అద్భుత రికార్డు ఉంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 70.50 స‌గ‌టుతో 282 ప‌రుగులు చేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 504 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు.

Virat Kohli : ఆస్ట్రేలియాకు దబిడిదిబిడే.. ప్రాక్టీస్ మొద‌లెట్టిన విరాట్ కోహ్లీ.. గుజ‌రాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌తో..

డేవిడ్‌ వార్నర్ రిటైర్ అయిన త‌రువాత మార్ష్ ఓపెన‌ర్ అవ‌తారం ఎత్తాడు. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాట‌ర్‌గా విఫ‌లం అయ్యాడు. అయితే.. కెప్టెన్‌గా మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఈ సిరీస్‌లో విండీస్‌ను 5-0 తేడాతో వైట్ వాష్ చేసింది ఆస్ట్రేలియా.

ఇక ఆస్ట్రేలియాలో ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న విష‌యానికి .. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20, వ‌న్డే సిరీస్‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీ20 సిరీస్ ఆగ‌స్టు 10 నుంచి 16 వ‌ర‌కు వ‌న్డే సిరీస్ 19 నుంచి 24 వ‌రకు జ‌ర‌గ‌నుంది.