Ashwin-Sanju Samson : ట్రేడ్ రూమర్స్ వేళ.. ‘నేను కేరళలో ఉండి నువ్వు చెన్నైకి వెళితే..’ సంజూ శాంసన్‌తో అశ్విన్..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా మారాడు.

Ravichandran Ashwin Teases Sanju Samson video viral
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా మారాడు. మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో డిబేట్‌లు, ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తాజాగా అతడు టీమ్ఇండియా ఆటగాడు సంజూ శాంసన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది.
కాగా.. ఐపీఎల్ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు, రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఇటీవల వీరిద్దరు తమ తమ ఫ్రాంఛైజీలు వీడనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రొమో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. అశ్విన్ మాట్లాడుతూ.. “నిన్ను చాలా ప్రశ్నలు అడగాలని ఉంది. కానీ అంతకన్నా ముందు ఓ విషయం గురించి మాట్లాడుతాను. అది ట్రేడ్ గురించి. కేరళలోనే ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే చాలా రూమర్లు వస్తున్నాయి. వాటి గురించి నాకు తెలియదు. ఆ విషయం నిన్నే అడుగుదామని అనుకుంటున్నా. నేను కేరళలో ఉండి, నువ్వు చెన్నైకి వెళ్లొచ్చు.” అని అశ్విన్ అన్నాడు.
Shaheen Afridi : పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డ్..
కాగా.. వీరిద్దరు ఐపీఎల్ ట్రేడింగ్ గురించే మాట్లాడారా? లేక ఏదైన లీగ్ గురించి మాట్లాడారా? అన్న విషయాలు ప్రస్తుతానికి తెలియడం లేదు. మరి అశ్విన్ ప్రశ్నలకు సంజూ ఏ విధంగా సమాధానాలు చెప్పాడు వంటి విషయాలు తెలియాలంటే ఫుల్ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు.