Virat Kohli : ఆస్ట్రేలియాకు దబిడిదిబిడే.. ప్రాక్టీస్ మొదలెట్టిన విరాట్ కోహ్లీ.. గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌తో..
విరాట్ కోహ్లీ వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.

Virat Kohli begins ODI comeback pic viral
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతడు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న కోహ్లీ అక్కడే శిక్షణను ప్రారంభించాడు. శుక్రవారం అతడు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్‌తో ఇండోర్ సెషన్ నుండి ఫోటోలను పంచుకున్నాడు. “నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు సోదరా.. నిన్ను చూడడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది.”అని కోహ్లీ రాసుకొచ్చాడు.
Shaheen Afridi : పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డ్..
Virat Kohli’s Instagram story. pic.twitter.com/MBWRw6fStx
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2025
దీనికి నయీమ్ రిప్లై ఇచ్చాడు. “మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది సోదరా.. త్వరలో కలుద్దాం” అని బదులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ ఫోటోల్లో కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడు.
టీమ్ఇండియా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరగనుంది.
ఇప్పటి వరకు కోహ్లీ 302 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 57.9 సగటుతో 14,181 పరుగులు చేఆడు. ఇందులో 51 శతకాలు, 74 అర్థశతకాలు ఉన్నాయి.