Yashasvi Jaiswal
IND vs AUS 2nd Test Match : ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగ్గా ఇండియా ఘన విజయం సాధించింది. రెండో టెస్టు డేనైట్ మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు.
Also Read: IND vs AUS 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుదిజట్టులోకి అశ్విన్.. వారికి నోఛాన్స్
టీమిండియాకు ఇన్నింగ్స్ మొదటి బంతికే బిగ్ షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతి వేగంగా దూసుకొచ్చి ప్యాడ్స్ కు తగిలింది. దీంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. జైస్వాల్ రివ్యూ తీసుకునేందుకు తన సహచర బ్యాటర్ కేఎల్ రాహుల్ తో చర్చించాడు. కానీ, రాహుల్ సైతం అది అవుట్ అని చెప్పడంతో జైస్వాల్ పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తరువాత క్రీజులోకి శుభ్‌మన్ గిల్ వచ్చాడు.
శుభ్‌మన్ గిల్ పెర్త్ లో జరిగిన మొదటి టెస్టుకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను తొలిటెస్టులో ఆడలేదు. గాయం నుంచి కోలుకోవడంతో రెండు టెస్టులో తుదిజట్టులో అతనికి చోటు దక్కించుకున్నాడు. ఇదిలాఉంటే. యశస్వీ జైస్వాల్ అవుట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
MITCHELL STARC STARTS THE PINK BALL TEST WITH A WICKET. 🤯pic.twitter.com/JdX0kr7Eck
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2024