IND vs AUS 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుదిజట్టులోకి అశ్విన్.. వారికి నోఛాన్స్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.

IND vs AUS 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుదిజట్టులోకి అశ్విన్.. వారికి నోఛాన్స్

Pink-Ball Test in Adelaide

Updated On : December 6, 2024 / 9:40 AM IST

IND vs AUS 2nd Test Day 1: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా ఇవాళ ప్రారంభమైంది. డేనైట్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదిలాఉంటే మొదటి టెస్టుకు దూరమైన రోహిత్, శుభమన్ గిల్ ఈ టెస్టులో ఆడుతున్నారు. మొత్తం మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఈ టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో రవిచంద్ర అశ్విన్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తుదిజట్టులోకి చేరారు. ఒక్క మార్పుతో ఆసీస్ బరిలోకి దిగింది.

Also Read: ICC Champions Trophy: పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోపీలో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌న్నీ అక్క‌డే..!

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగుందని పేర్కొన్నారు. పిచ్ పై పచ్చిక పెద్దగా లేదని, పొడిగా ఉండటంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చునని తొలుత బ్యాటింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. జట్టులోని ప్రతిఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. పెర్త్ టెస్టులో అద్భుతంగా ఆడారు. అదే జోష్ తో రెండో టెస్టు బరిలోకి దిగుతున్నాం. నేను ఇక్కడ దాదాపు రెండు వారాల నుంచి ఉన్నా.. నెట్స్ లో ప్రాక్టీస్ బాగా జరిగిందని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు ఆడిలైడ్ ఓవల్ లో ప్రస్తుతం వాతావరణం మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇండియా జట్టు :
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, రవిచంద్ర అశ్విన్, హర్షిత్ రాణా, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు :
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్.