×
Ad

Mitchell Starc : మిచెల్ స్టార్క్ అరుదైన ఘ‌న‌త‌.. అశ్విన్ ను అధిగ‌మించి ఎలైట్ లిస్ట్‌లో చోటు..

ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc ) అరుదైన ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ చ‌రిత్ర‌లో..

Mitchell Starc surpasses Ashwin in the list of highest wicket takers in WTC

Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. పెర్త్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టు మ్యాచ్‌లో మొద‌టి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను అధిగ‌మించాడు. అశ్విన్ 41 టెస్టుల్లో 195 వికెట్లు తీయ‌గా స్టార్క్ (Mitchell Starc ) 50 టెస్టుల్లో 198 వికెట్లు సాధించాడు.

IND vs SA : రెండో టెస్టుకు ముందు భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌..!

ఇక డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ఆట‌గాడు నాథన్ లియోన్ పేరిట ఉంది. అత‌డు 54 మ్యాచ్‌ల్లో 219 వికెట్లు తీశాడు. మ‌రో ఆసీస్ ఆట‌గాడు పాట్ క‌మిన్స్ 215 వికెట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) – 54 టెస్టుల్లో 219 వికెట్లు
* పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 51 టెస్టుల్లో 215 వికెట్లు
* మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 50 టెస్టుల్లో 198 వికెట్లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 41 టెస్టుల్లో 195 వికెట్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 41 టెస్టుల్లో 183 వికెట్లు

Joe Root : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అవాంఛిత రికార్డును స‌మం చేసిన జో రూట్‌..

ఎలైట్ లిస్ట్‌లో..

ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్య‌ధిక ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో మిచెల్ స్టార్క్ చోటు సంపాదించాడు. ఈ క్ర‌మంలో అత‌డు టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రాతో క‌లిసి నిలిచాడు. వీరిద్ద‌రు చెరో ఐదు సార్లు చొప్పున ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశారు.