Mithun Manhas appointed as new BCCI president
Mithun Manhas : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యాడు. ఆదివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మిథున్ మన్హాస్‌ను ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల 70వ వసంతంలోకి అడుగుపెట్టడంతో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో 45 ఏళ్ల మిథన్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షడుగా పని చేయనున్నారు.
Hardik Pandya : పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్.. హార్దిక్‌కు సెంచరీ చేసే గోల్డెన్ ఛాన్స్..
ఎవరీ మన్హాస్?
1979 అక్టోబర్ 12న జమ్మూ కశ్మీర్‌లో జన్మించారు మిథున్ మన్హాస్. టీమ్ఇండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆయన ఆడలేదు. అయినప్పటికి దేశవాళీ క్రికెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవాళీలో ఢిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 46 సగటుతో 9714 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్థశతకాలు ఉన్నాయి. 130 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 22.3 సగటుతో 514 పరుగులు సాధించాడు.