Hardik Pandya : పాకిస్తాన్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌.. హార్దిక్‌కు సెంచ‌రీ చేసే గోల్డెన్ ఛాన్స్‌..

పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Hardik Pandya : పాకిస్తాన్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌.. హార్దిక్‌కు సెంచ‌రీ చేసే గోల్డెన్ ఛాన్స్‌..

Hardik Pandya Need two Wickets To Enter Into 100 T20 Wickets Club

Updated On : September 28, 2025 / 1:04 PM IST

Hardik Pandya : ఆసియాక‌ప్ 2025 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాక్ జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya ) ఓ అరుదైన రికార్డును ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాండ్యా రెండు వికెట్లు తీస్తే.. అంత‌ర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క‌బ్‌లో చేర‌తాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త బౌల‌ర్‌గా నిలుస్తాడు. దీంతో పాక్‌తో మ్యాచ్‌లోనే హార్దిక్ ఈ రికార్డును అందుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

హార్దిక్ పాండ్యా ఇప్ప‌టి వ‌ర‌కు 120 మ్యాచ్‌లు ఆడాడు. 108 ఇన్నింగ్స్‌ల్లో 1860 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ‌శ‌త‌కాలు సాధించాడు. ఇక బౌలింగ్‌లో 98 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న మూడు సార్లు న‌మోదు చేశాడు.

Virat Kohli : ఓవైపు భార‌త్, పాక్ ఫైన‌ల్ మ్యాచ్‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కోహ్లీ మూడు ప‌దాల పోస్ట్..

4 వికెట్లు తీస్తే..

పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీస్తే.. టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు అర్ష్‌దీప్ సింగ్ పేరిట ఉంది. 65 మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ సింగ్ 101 వికెట్లు సాధించాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* అర్ష్‌దీప్ సింగ్ – 65 ఇన్నింగ్స్‌ల్లో 101 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 108 ఇన్నింగ్స్‌ల్లో 98 వికెట్లు
* యుజ్వేంద్ర చాహ‌ల్ – 79 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 73 ఇన్నింగ్స్‌ల్లో 94 వికెట్లు
* భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 86 ఇన్నింగ్స్‌ల్లో 90 వికెట్లు