Virat Kohli : ఓవైపు భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్.. మరోవైపు సోషల్ మీడియాలో కోహ్లీ మూడు పదాల పోస్ట్..
విరాట్ కోహ్లీ(Virat Kohli) సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు అన్న సంగతి తెలిసిందే.

Virat Kohli 3 Word Post Breaks The Internet
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడు అన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఒకసారి మాత్రమే అతడు పోస్టులను చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న కోహ్లీ ఆదివారం సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది.
తన భార్య అనుష్కశర్మతో కలిసి దిగిన ఫోటోను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఒక్క నిమిషం అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం 15 గంట్లలోనే 9 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Sunil Gavaskar : ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. పాక్‌కు సునీల్ గవాస్కర్ వార్నింగ్..!
View this post on Instagram
అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఆసియాకప్ 2025 ఆడుతోంది. నేడు చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతుండడంతో కోహ్లీ ఇందులో పాల్గొనడం లేదు. గతంలో పాక్ పై ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ నేటి మ్యాచ్‌లో లేకపోవడం కాస్త లోటుగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
IND vs PAK : పాక్‌తో ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఈ ‘మూడు’ మారాల్సిందే..
మళ్లీ మైదానంలో కోహ్లీ కనిపించేది ఎప్పుడంటే..?
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలతో భారత జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే కోహ్లీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ఆసీస్‌తో సిరీస్ కోసం కోహ్లీ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు.