Jasprit Bumrah : టెస్టుల నుంచి బుమ్రా రిటైర్‌మెంట్‌.. షాకింగ్ కామెంట్స్ చేసిన కైఫ్..

బుమ్రా గురించి టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Mohammad Kaif shocking comments on bumrah test future

మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు నాలుగో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ మూడో రోజు ఆట‌లో టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా త‌న రిథ‌మ్‌ను అందుకునేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ స‌మ‌యంలో అత‌డు పూర్తి ఫిట్‌గా ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఎప్పుడూ నిల‌క‌డ‌గా 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే అత‌డు 125 నుంచి 130 కి.మీ వేగంతోనే బౌలింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో బుమ్రా గురించి టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో.. టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ బుమ్రా త్వ‌ర‌లోనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవ‌చ్చున‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం అత‌డు గాయాల‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని, అత‌డి శ‌రీరం కూడా అత‌డికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు. అత‌డి బౌలింగ్‌లో రిథ‌మ్ కూడా క‌నిపించ‌డం లేదన్నాడు.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్‌ను చిక్కుల్లో ప‌డేసిన బౌలింగ్ కోచ్.. అరెరె ఇప్పుడెలా సామీ..

బుమ్రా చాలా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అని కైఫ్ చెప్పాడు. తాను 100 శాతం ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేక‌పోతున్నాన‌ని అత‌డు భావిస్తే వెంట‌నే అత‌డు ఆడ‌న‌ని చెప్పేస్తాడ‌ని అనుకుంటున్నాను అని అన్నాడు. మాంచెస్ట‌ర్‌లో అత‌డు వికెట్లు తీయ‌క‌పోవ‌డాన్ని ప‌క్క‌న బెడితే కూడా అత‌డి బౌలింగ్ వేగం 125 నుంచి 130 కి.మీ మ‌ధ్య ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నాడు. అత‌డు తీసిన ఒక్క వికెట్ కూడా.. వికెట్‌ కీప‌ర్ ముందుకు డైవ్ చేసి క్యాచ్ ప‌ట్ట‌డంతోనే ల‌భించింద‌న్నాడు. బుమ్రా ఫిట్ గా లేడ‌ని, ఒక‌వేళ అత‌డు ఫిట్‌గా ఉంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వికెట్లు తీయగలడని అన్నాడు.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్ పై ర‌విశాస్త్రి ఆగ్ర‌హం.. ఇవేం వ్యూహాలు.. నాలుగు వికెట్లు తీసిన బౌల‌ర్‌ను..

ఇక త‌న‌కు అనిపించింది త‌ప్పు కావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు కైఫ్ చెప్పాడు. భ‌విష్య‌త్తులోనూ బుమ్రా టెస్టులు ఆడాల‌న్నాడు. ఇంగ్లాండ్‌తో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు బుమ్రా 13 వికెట్లు తీశాడు. నాలుగో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఏ మాత్రం రిథ‌మ్‌లో క‌నిపించ‌ లేదు.