Mohammed Shami Drops Bombshell on his retirement
Mohammed Shami : టెస్టు క్రికెట్ నుంచి భారత సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రిటైర్‌మెంట్ అవుతున్నారు. తొలుత రోహిత్ శర్మ, ఆ తరువాత విరాట్ కోహ్లీ లు సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా ఇటీవల చతేశ్వర్ పుజారా సైతం వీడ్కోలు పలికాడు. ఇక ఈ రిటైర్‌మెంట్ లిస్టులో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మహ్మద్ షమీ(Mohammed Shami).
అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం షమీ టీమ్ఇండియా తరుపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరం కాగా.. కోలుకున్న తరువాత అతడు టెస్టు జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డే, ఇంగ్లాండ్ తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు.
తన రిటైర్‌మెంట్ పై వస్తున్న వార్తలపై స్పందిస్తూ తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందన్నాడు. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశ్యం తనకు లేదన్నాడు. ఎవరికైనా తనతో సమస్య ఉందా అని ఎదురు ప్రశ్నించాడు. ఆటపై తనకు విసుగు వచ్చే వరకు కొనసాగుతానని చెప్పాడు.
తాను రిటైర్‌మెంట్ తీసుకుంటే ఎవరి జీవితాలు బాగుంటాయో చెప్పాలని షమీ ప్రశ్నించాడు. తనకు ఆటపై ఎప్పుడు విసుగు వస్తుందో అప్పుడు వీడ్కోలు చెబుతానని అన్నాడు. తాను ఇప్పటికి కూడా కష్టపడుతున్నానని చెప్పుకొచ్చా డు. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక కాకుంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడతానన్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఆడేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లుగా చెప్పాడు.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ గురించి..
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. వరుస విజయాలతో ఫైనల్ చేరుకుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీనిపై షమీ మాట్లాడుతూ.. ఆ రోజు తమకు అదృష్టం కలిసి రాలేదన్నాడు. కలిసి వచ్చి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నాడు. ఛాంపియన్లుగా నిలిచేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.
Ashwin : ఇదేం సిత్రమో.. అశ్విన్ మొదటి, ఆఖరి ఐపీఎల్ వికెట్లు ఒకే రోజున ఇంకా..
వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని షమీ అన్నాడు. ఆ జట్టులో సభ్యుడిగా ఉండాలని ఉందన్నాడు. గత రెండు నెలల్లో ఫిట్‌నెస్‌ను ఎంతో మెరుగుపరచుకున్నట్లుగా తెలిపాడు. తన ఆటలోని వివిధ అంశాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పాడు. తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని షమీ వెల్లడించాడు.
ఇప్పటి వరకు షమీ టీమ్ఇండియా తరుపున 64 టెస్టులు, 108 వన్డేలు, 27 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 462 వికెట్లు పడగొట్టాడు.