Mohammed Shami : అయ్యో పాపం.. ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన ష‌మీ.. స్పందించిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌

టీమ్ఇండియా సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.

Mohammed Shami gets stuck at his temporary home Sonu Sood mocks him

Mohammed Shami – Sonu Sood : టీమ్ఇండియా సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన షమీ ఆ టోర్నీలో గాయ‌ప‌డ్డాడు. ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం గాయం కార‌ణంగా ఆట‌కు దూరంగా ఉన్నాడు. శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నఅతడు ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు.

అయితే.. తాజాగా ష‌మీ ఓ విమానాశ్ర‌యంలో చిక్కుకుపోయాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డు వెల్ల‌డించాడు. అయితే.. తాను ఎక్క‌డికి వెలుతున్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసి.. మ‌ళ్లీ నా విమానం ఆల‌స్య‌మైంది. ఎయిర్ పోర్టు నాకు తాత్కాలిక ఇల్లుగా మారిపోయింద‌ని రాసుకొచ్చాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. అశ్విన్ భార్య ఆస‌క్తిక‌ర పోస్ట్‌..

దీనిపై నెటిజ‌న్లు ప‌లుర‌కాలుగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ సైతం స్పందించాడు. ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు. ఎయిర్ పోర్టులో కూడా అత‌డు ఇంట్లో ప‌డుకున్న‌ట్లుగానే ప‌డుకుంటాడ‌ని చెప్పుకొచ్చాడు. దీనికి ష‌మీ ‘హహహ’ అంటూ రిప్లై ఇచ్చాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న ‘సిక్స‌ర్ల’ రికార్డు..

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ నాటికి ష‌మీ ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని గ‌తంలో చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ చెప్పారు. అయితే.. అది జ‌ర‌గ‌లేదు. న్యూజిలాండ్‌తో సిరీస్ నాటికి ష‌మీ ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు క్రీడా వ‌ర్గాలు చెబుతున్నాయి.

MS Dhoni : ధోనికి కోపం వ‌స్తే.. జ‌రిగేది ఇదే.. సీఎస్‌కే మాజీ ఆట‌గాడి వ్యాఖ్య‌లు వైర‌ల్‌