Mohammed Shami To Make Competitive Return In Ranji Trophy
నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు శుభవార్త అందింది. టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యాడు. చీలమండల గాయం కారణంగా దాదాపు ఏడాదికి పై ఆటకు దూరంగా ఉన్నాడు.
ఫిట్‌నెస్ సాధించిన అతడు రంజీట్రోఫీలో పశ్చిమ బెంగాల్ తరుపున బరిలోకి దిగనున్నాడు. ఐదో రౌండ్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌తో బెంగాల్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ తరుపున షమీ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
AFG vs BAN : కొద్దిలో తప్పించుకున్న రషీద్ ఖాన్.. లేదంటే తలపగిలేదిగా ? వీడియో
కాగా.. ఈ మ్యాచ్‌లో షమీ గనుక మునపటి రిథమ్ అందుకుని సత్తా చాటిటే ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గనుక టీమ్ఇండియాకు అతడు అందుబాటులోకి వస్తే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున షమీ చివరి సారి ఆడాడు. ఆ టోర్నీలో గాయంతో బాధపడుతూనే మ్యాచులు ఆడాడు. టోర్నీ ముగిసిన వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. వాస్తవానికి కివీస్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడి రీ ఎంట్రీ ఇస్తాడని భావించారు. అయితే.. కోలుకోకపోవడంతో అలా జరుగలేదు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ముందు రంజీట్రోఫీలో బరిలోకి దిగుతానని ఓ ఇంటర్య్వూలో షమీ వెల్లడించాడు.