IND vs BAN : ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి రోహిత్ శ‌ర్మ క్యాచ్‌.. తానేమీ త‌క్కువ కాదంటూ శ‌రీరాన్ని విల్లుగా వంచి సిరాజ్ క్యాచ్‌.. నోరెళ్ల‌బెట్టిన బంగ్లా..

ఇటీవల కాలంలో టీమ్ఇండియా ఫీల్డింగ్ ఎంతో మెరుగుప‌డింది.

Mohammed Siraj follows Rohit Sharma footsteps takes stunning running back catch

ఇటీవల కాలంలో టీమ్ఇండియా ఫీల్డింగ్ ఎంతో మెరుగుప‌డింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ఫీల్డింగ్ చేస్తున్నారు. కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఎంతో క‌ష్ట‌మైన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒంటి చేత్తో అందుకోగా తానేమీ త‌క్కువ కాదు అంటూ సిరాజ్ సైతం ఓ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. వీరిద్ద‌రి క్యాచుల‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాన్పూర్‌లో తొలి రోజు 35 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్యం అవ్వ‌గా, రెండు, మూడు రోజుల ఆట‌ ర‌ద్దైంది. ఎట్ట‌కేల‌కు నాలుగో రోజు మ్యాచ్ ఆరంభ‌మైంది. ఆట ప్రారంభమైన కాసేప‌టికే ముష్ఫికర్ రహీమ్(11) ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వ‌చ్చిన‌ లిట‌న్ దాస్ (13) మూడు బౌండ‌రీలు బాది భార‌త బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగాడు.

Musheer Khan : యాక్సిడెంట్ త‌రువాత తొలిసారి మాట్లాడిన‌ ముషీర్ ఖాన్‌.. మెడ‌కు ప‌ట్టీ పెట్టుకుని..

అదే  ఊపులో సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించాడు. మిడాఫ్ మీదుగా బంతిని బౌండ‌రీకి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శ‌ర్మ త‌న త‌ల మీదుగా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో ఒడిసిప‌ట్టుకున్నాడు.

సిరాజ్ స్ట‌న్నింగ్ క్యాచ్‌..

లిట‌న్ ఔట్ కావ‌డంతో ష‌కీబ్ అల్ హ‌స‌న్ (9) క్రీజులోకి వ‌చ్చాడు. అత‌డు అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలో బంతిని బ‌లంగా బాదాడు. అయితే.. సిరాజ్ ఒంటి విల్లులా వెన‌క్కి వంచుతూ.. డైవ్ చేస్తూ ఎడ‌మ చేతితో బంతిని అందుకున్నాడు. దీంతో ష‌కీబ్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ప్ర‌స్తుతం రోహిత్, సిరాజ్‌లు అందుకున్న క్యాచ్‌ల‌కు సంబంధించిన‌ ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు లంచ్ విరామానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. మోమినుల్ హక్ (102), మెహిదీ హసన్ మిరాజ్ (6) లు క్రీజులో ఉన్నారు.

County Championship : బ్యాట‌ర్ క్లీన్‌బౌల్డ్ అయినా ఔట్ ఇవ్వ‌ని అంపైర్‌.. ఇలాంటి ఓ రూల్ కూడా ఉందా? ట‌వ‌ల్ కార‌ణ‌మా?