Most runs in ODI How many runs does Virat Kohli need to break Sachin record
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తరువాత మూడో వన్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(74)తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీల మోత మోగించాడు.
ఈ క్రమంలో తన ఫామ్‌పై ఎలాంటి సందేహాలు అక్కరలేదని, 2027 వన్డే ప్రపంచకప్ రేసులో తాను ఉన్నట్లు సెలక్టర్లకు కోహ్లీ (Virat Kohli) సంకేతాలు పంపాడు. బుధవారం రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 102 పరుగులు చేయడంతో వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ పరుగులు 14,492కు చేరుకున్నాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 44.8 సగటుతో 18426 పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలు, 96 అర్థశతకాలు ఉన్నాయి. సచిన్ కంటే కోహ్లీ 3934 పరుగుల వెనకబడి ఉన్నాడు.
ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ ఆడితే.. వన్డేల్లో సచిన్ పరుగుల రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. అయితే.. అది అంత సులువు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
Sanju Samson : టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు సంజూ శాంసన్ వార్నింగ్!
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 18426 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 14492 పరుగులు
* కుమార సంగక్కర (శ్రీలంక) – 14234 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13074 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 13430 పరుగులు