Mitchell Starc : టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ఏకైక ఎడమచేతి వాటం పేసర్..
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అరుదైన ఘనత సాధించాడు.
Mitchell Starc surpasses Wasim Akram as most successful left arm test pacer
Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం గబ్బా వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఈ క్రమంలో అతడు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ను అధిగమించాడు. వసీం అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్ 102 టెస్టుల్లో 415 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో స్టార్క్ 16వ స్థానంలో నిలిచాడు.
Sanju Samson : టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు సంజూ శాంసన్ వార్నింగ్!
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం పేసర్లు వీరే..
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) – 415 * వికెట్లు
వసీం అక్రమ్ (పాకిస్తాన్) – 414 వికెట్లు
చమింద వాస్ (శ్రీలంక) – 355 వికెట్లు
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) – 317 వికెట్లు
జహీర్ ఖాన్ (భారత్) – 311 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గబ్బా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జోరూట్ (68), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (4)లు క్రీజులో ఉన్నారు.
🚨 HISTORY CREATED BY STARC. 🚨
– Mitchell Starc has most wickets as a left arm pacer in Test cricket. 🤯 pic.twitter.com/RSycnAJrRx
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 4, 2025
ఇంగ్లీష్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (76) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెన్ డకెట్, ఓలీ పోప్‌లు డకౌట్లు అయ్యారు. హ్యారీ బ్రూక్ (31) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. మైఖేల్ నెసర్ ఓ వికెట్ పడగొట్టాడు.
