MS Dhoni : ‘యానిమల్’గా మారిన ధోని.. సందీప్ రెడ్డి వంగాతో కలిసి.. వీడియో వైరల్..
ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ రిలీజ్ చేసిన యాడ్ చూస్తే అందరి మతులు పోవాల్సిందే.

టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఊహించడానికి ఇది కొంచెం కష్టమే అయినప్పటికి.. వీరిద్దరు కలిసి ఓ యాడ్‌లో చేశారు. ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఓ ప్రముఖ కంపెనీ రిలీజ్ చేసిన యాడ్ చూస్తే అందరి మతులు పోవాల్సిందే.
సందీప్ రెడ్డి పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలే గుర్తొస్తాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అదే సమయంలో అతడు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు.
MS DHONI BANGER DROPS. 🎤
– What a wonderful Ad by EMotorad with MSD and Sandeep Reddy Vanga. 😂🔥 pic.twitter.com/0AN6efQWnk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2025
ఈమోటోరాడ్ అనే ఎలక్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగా, ధోని చేతులు కలిపి ఓ యాడ్‌ను చేశారు. యానిమల్ సినిమాలో ధోని నటిస్తే ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లుగా ఈ యాడ్‌ని అలాగే రూపొందించారు.
యాడ్ ప్రారంభంలో పలు కార్లు ఆగగానే.. స్టైలిష్‌గా ధోని ఓ కారు డోర్ తీసుకుని బయటకు దిగాడు. నల్లని కళ్లద్దాలు, బ్లూ కోట్‌తో స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని విధంగా ధోని కనిపించాడు. నోట్లో టూత్ పిక్ పెట్టుకుని ధోని సైగ చేయగానే గన్స్ పట్టుకుని సెక్యురిటీ వెంటరాగా.. ధోని సైకిల్‌ను నడిపించుకుంటూ రోడ్డు దాటుతూ ఉంటాడు.
ఇంతలో దర్శకుడు సందీప్ కట్.. కట్.. అని అంటాడు. అద్భుతంగా చేశారు అంటూ ధోనిని పొగుడుతూ ఉంటాడు. ఆఖరిలో విజిల్ వేస్తాడు. ఇందుకు ధోని నేను చెవిటి వాడిని కాదు.. నాకు వినిపిస్తూనే ఉంది అంటూ కొంచెం యాటిట్యూడ్‌తో మాట్లాడుతాడు. ధోని చెప్పేది వినకుండానే హీరో దొరికేశాడని సందీప్ అంటాడు.
ఆ తరువాతి షాట్‌లో ధోని సైకిల్‌పై స్ట్రైలిష్‌గా వస్తాడు. స్టాండ్ వేసి కీ చేతుల్లోకి తీసుకుని తిప్పుతుండగా.. కట్ అని సందీప్ అంటాడు. నాకు వెనుక జట్టు కాస్త ఎక్కువ కాలేదా అని ధోని అడిగితే అలాగే ఉండాలి.. అని సందీప్ అంటాడు. ఇది సైకిల్ యాడ్ అని ధోని అనగా.. నెక్ట్స్ సీన్ ఏమౌతుందో చూడు అంటూ సందీప్ అంటాడు.
ఇలా మొత్తంగా యాడ్ అదిరిపోయింది.