Most wickets in an IPL match : ఐపీఎల్ బౌలింగ్ లో తోపులు.. ఒక్క మ్యాచ్ లోనే 5,6 వికెట్లు పడగొట్టిన బౌలర్స్ వీళ్లే..
ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా?

Bowlers who picked most wickets in an IPL match Jasprit Bumrah to Alzarri Joseph
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు 17 సీజన్లు పూర్తి అయ్యాయి. మార్చి 22 నుండి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
ఇక ఐపీఎల్ అంటే బ్యాటర్ల ధనాధన్ ఆటే కాదు ఫీల్డర్ల విన్యాసాలతో పాటు బౌలర్ల మెరుపులు ఉంటాయి. కాగా.. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు అన్నది ఓ సారి చూద్దాం..
అల్జారి జోసెఫ్..
ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ పేసర్ అల్జారి జోసెఫ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2019లో అతడు ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నప్పుడు ఈ ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ఆరు వికెట్లు తీశాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 3.4 ఓవర్ల వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
సోహైల్ తన్వీర్..
పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ సోహైల్ తన్వీర్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతను ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సోహైల్ తన్వీర్ నాలుగు ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
ఆడమ్ జంపా..
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తరుపున ఆడిన జంపా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ఆరు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జంపా నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.
అనిల్ కుంబ్లే..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే సైతం ఈ జాబితాలో చోటు సంపాదించాడు. 2009లో ఆర్‌సీబీ తరుపున ఆడిన కుంబ్లే రాజస్థాన్ రాయల్స్ పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో కుంబ్లే 3.1 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఆకాష్ మధ్వాల్..
ముంబై తరఫున ఆకాష్ మధ్వాల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. 3.3 ఓవర్లలో ఐదు పరుగులు ఇచ్చి ఈ ఘనత సాధించాడు.
జస్‌ప్రీత్ బుమ్రా..
భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆ జాబితాలో చోటు సంపాదించాడు. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన బుమ్రా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.
మోహిత్ శర్మ..
గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన మోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు వేసి 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఇషాంత్ శర్మ..
2011 ఐపీఎల్ సందర్భంగా డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన ఇషాంత్ శర్మ కొచ్చిపై మూడు ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
Virat Kohli : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానులకు విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి..
లసిత్ మలింగ..
2011 ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడి ఐదు వికెట్లు తీశాడు శ్రీలంక దిగ్గజ ఆటగాడు లసిత్ మలింగ. అతను 3.4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడెన్ ఓవర్ ఉండడం విశేషం.