Virat Kohli : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానులకు విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి..
విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు.

Virat Kohli special request to fans for Rajat Paitdar ahead of IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆ జట్టు అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. తమ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఆశీర్వదించాలని ఆర్‌సీబీ అన్‌బాక్సింగ్ ఈవెంట్‌లో అభిమానులకు పిలుపునిచ్చాడు కోహ్లీ. చాలా కాలం పాటు అతడు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉంటాడని అన్నాడు.
గత సీజన్లలో ఆర్‌సీబీకి ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వం వహించాడు. అయితే.. మెగా వేలానికి ముందు అతడిని ఆర్‌సీబీ విడిచిపెట్టింది. వేలంలోనూ అతడిని కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన తరువాత తమ జట్టు కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది.
PAK vs NZ : పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు ఐసీసీ భారీ షాక్.. దెబ్బకు బొమ్మ కనపడింది!
‘రజత్ ఎంతో ప్రతిభావంతుడు. అతడి భుజాలపై చాలా పెద్ద బాధ్యత ఉంది. సుదీర్ఘ కాలం పాటు అతడు జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మీరు ఇవ్వగలిగినంత ప్రేమను అతడికి ఇవ్వండి. జట్టును నడింపించేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి.’ అని అన్‌బాక్స్ ఈవెంట్‌లో కోహ్లీ అన్నాడు. ఆ తరువాత రజత్‌ను ప్రేక్షకులను పరిచయం చేశాడు.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి ఇప్పటి వరకు ఒకే ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. ఈ విషయం పై మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైందన్నాడు. ప్రతీ సీజన్‌కు ముందు అదే ఉత్సాహం తనను ఉత్తేజపరుస్తోందన్నాడు. జట్టులో నైపుణ్యాలకు కొదవలేదని, ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
గొప్ప గౌరవంగా భావిస్తున్నా..
ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రజత్ పాటిదార్ అన్నాడు. కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి ఆర్‌సీబీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఈ దిగ్గజాల ఆటను చూస్తూ పెరిగానని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని రజత్ తెలిపాడు.