PAK vs NZ : పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు ఐసీసీ భారీ షాక్.. దెబ్బకు బొమ్మ కనపడింది!
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షా కు ఐసీసీ షాక్ ఇచ్చింది.

ICC slaps Pakistan player with hefty fine and three demerit points
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షా కు ఐసీసీ షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి 20 మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర జరిమానా విధించింది. అంతేకాదండోయ్.. అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లను చేర్చింది.
అసలేం జరిగింది..?
ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన తరువాత పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో పాక్ తొలుత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆతరువాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఐదు మ్యాచ్ టీ20 సిరీస్‌లో భాగంగా మార్చి 16న తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లోని మూడో బంతిని ఖుష్‌దిల్ మిడ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. వికెట్ల మధ్య పరుగు తీసే క్రమంలో ఖుష్ దిల్ షా న్యూజిలాండ్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ ను బలంగా ఢీ కొట్టాడు. ఖుష్‌దిల్ ఎడమ భుజం ఫాల్స్క్‌ను బలంగా తాకిది. అయితే.. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ కాలేదు.
కాగా.. ఘటన సమయంలో ఖుష్‌దిల్ నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది. దీనిపై ఐసీసీ సీరియస్ అయింది. ఈ క్రమంలోనే అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించడంతో పాటు అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు జతచేసింది.
రాబోయే 24 నెలల కాలంలో అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే అతడిపై ఓ టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20 మ్యాచ్‌ల నిషేదం పడనుంది. వీటిలో ఏదీ ముందు జరిగితే.. వాటిలో అతడు ఆడకూడదు.
ఈ మ్యాచ్‌లో పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. 32 పరుగులతో ఖుష్‌దిల్ షా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.