PM Modi : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జోక్‌.. చిరు న‌వ్వులు చిందించిన భార‌త ప్ర‌ధాని మోదీ

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో న్యూజిలాండ్ జ‌ట్టును భార‌త్ ఓడించి విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

PM Modi : ఛాంపియ‌న్స్  ట్రోఫీ ఫైన‌ల్ పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జోక్‌.. చిరు న‌వ్వులు చిందించిన భార‌త ప్ర‌ధాని మోదీ

PM Modi laughter as NZ PM Christopher Luxon cracks joke on India beating New Zealand in Champions Trophy 2025

Updated On : March 18, 2025 / 10:22 AM IST

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్ర‌స్తుతం భార‌త దేశ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. సోమ‌వారం ఢిల్లీలో భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీతో కివీస్ ప్ర‌ధాని క్రిస్టోఫర్ లక్సన్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకోవ‌డ‌మే ఈ మీటింగ్ ప్ర‌ధాన అజెండా. అయితే.. ఈ భేటీలో ఓ స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో న్యూజిలాండ్ జ‌ట్టును భార‌త్ ఓడించి విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని కివీస్ ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ‘ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్ చేతిలో న్యూజిలాండ్ ఓట‌మిని ప్ర‌ధాని మోదీ ప్ర‌సావించ‌క‌పోవ‌డం నిజంగా అభినంద‌నీయం. అదే స‌మ‌యంలో నేను కూడా భార‌త్‌లో న్యూజిలాండ్ టెస్టు విజ‌యాల గురించి మాట్లాడ‌ద‌లుచుకోలేదు. దానిని అలాగే ఉంచి దౌత్యపరమైన సంఘటనను నివారించుకుందాం.’ అని ల‌క్స‌న్ అన్నారు.

Virat Kohli : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానుల‌కు విరాట్ కోహ్లీ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి..

దీంతో ప్ర‌ధాని మోదీతో పాటు కివీస్ మాజీ క్రికెట‌ర్ రాస్ టేల‌ర్‌, అక్క‌డ ఉన్న‌వారంతా న‌వ్వులు చిందించారు. గ‌తేడాది భార‌త ప‌ర్య‌ట‌న‌కు న్యూజిలాండ్ వచ్చింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ప్రపంచ క్రికెట్‌లో ఆధిప‌త్యం చెలాయిస్తున్న జ‌ట్ల‌లో భార‌త జ‌ట్టు ఒక‌టి అని కివీస్ ప్ర‌ధాని చెప్పారు. ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినప్పుడు వారు చాలా మంది హృదయాలను ఎలా బద్దలు కొట్టారో లక్సన్ వివ‌రించారు.

PAK vs NZ : పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ భారీ షాక్.. దెబ్బ‌కు బొమ్మ క‌నప‌డింది!

“ప్రధాని మోదీ హయాంలో.. క్రికెట్‌లో అత్యంత ఆధిపత్యం చెలాయించిన జట్టు భారత క్రికెట్ జట్టు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని నా బ్లాక్ ఇన్ పురుషుల (న్యూజిలాండ్ క్రికెట్ జట్టు)పై గెలిచింది. ఈ ప్రక్రియలో వారు నా హృదయంతో సహా చాలా మంది న్యూజిలాండ్ వాసుల హృదయాలను బద్దలు కొట్టారు. నేను అభినందనలు మాత్రమే చెబుతాను” అని లక్సన్ అన్నారు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జ‌ట్ల‌ను ఓడించి సెమీస్ చేసింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైన‌ల్‌కు చేరుకుంది. ఫైన‌ల్‌లో మ‌ళ్లీ న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియ‌న్స్ ట్రోఫీని కైవ‌సం చేసుకుంది.