Most fours in IPL : బౌండరీల బాహుబలి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్లు.. టాప్ 10లో 8 మంది మనోళ్లే.. హయ్యస్ట్ ఎవరో చూస్తే

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా..

Most fours in IPL : బౌండరీల బాహుబలి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్లు.. టాప్ 10లో 8 మంది మనోళ్లే.. హయ్యస్ట్ ఎవరో చూస్తే

Updated On : March 18, 2025 / 12:18 PM IST

ఐపీఎల్ అనేది ధ‌నాధ‌న్ ఆట‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ బ్యాట‌ర్లు సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డుతుంటారు. బౌండ‌రీలు బాదుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ 17 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఆట‌గాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం.

ఐపీఎల్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన రికార్డు టీమ్ఇండియా మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉంది. ధావ‌న్ 222 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 768 ఫోర్లు కొట్టాడు. ధావ‌న్ ఐపీఎల్‌లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ త‌రుపున ఆడాడు. ధావ‌న్ ఇప్ప‌టికే ఆట‌కు వీడ్కోలు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

PM Modi : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జోక్‌.. చిరు న‌వ్వులు చిందించిన భార‌త ప్ర‌ధాని మోదీ

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. కోహ్లీ 252 మ్యాచ్‌ల్లో 705 ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి కూడా కోహ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌రుపున‌నే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

వీరిద్ద‌రి త‌రువాతి స్థానాల్లో డేవిడ్ వార్న‌ర్‌, రోహిత్ శ‌ర్మ‌, సురేశ్ రైనా, గౌత‌మ్ గంభీర్‌లు ఉన్నారు.

Virat Kohli : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానుల‌కు విరాట్ కోహ్లీ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి..

ఐపీఎల్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

శిఖ‌ర్ ధావ‌న్ – 222 మ్యాచ్‌ల్లో 768 ఫోర్లు
విరాట్ కోహ్లీ – 252 మ్యాచ్‌ల్లో 705 ఫోర్లు
డేవిడ్ వార్న‌ర్ – 184 మ్యాచ్‌ల్లో 663 ఫోర్లు
రోహిత్ శ‌ర్మ – 257 మ్యాచ్‌ల్లో 599 ఫోర్లు
సురేశ్ రైనా – 205 మ్యాచ్‌ల్లో 506 ఫోర్లు
గౌత‌మ్ గంభీర్ – 154 మ్యాచ్‌ల్లో 492 ఫోర్లు
రాబిన్ ఉత‌ప్ప – 205 మ్యాచ్‌ల్లో 481 ఫోర్లు
అజింక్యా ర‌హానే -185 మ్యాచ్‌ల్లో 478 ఫోర్లు
దినేశ్ కార్తీక్ – 257 మ్యాచ్‌ల్లో 466 ఫోర్లు
ఫాఫ్ డుప్లెసిస్ – 145 మ్యాచ్‌ల్లో 421 ఫోర్లు