MS Dhoni Dubai Vacation Photos
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత కూడా అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో తన జట్టును విజేతగా నిలిపి ఐదో సారి చెన్నై జట్టును కప్పును ముద్దాడేలా చేశాడు.
కాగా.. ప్రస్తుతం ధోని తన కుటుంబంతో కలిసి దుబాయ్‌కు విహారయాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే ప్లాన్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా.. దుబాయ్‌లో ధోని, అతడి భార్య సాక్షిలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో బాలీవుడ్ నటి కృతి సనన్, నుపుర్ సనన్ తదితరులు కూడా కనిపించారు. అయితే.. వీరంతా కలిసే అక్కడకు వెళ్లారా..? లేదంటే అక్కడ ఏదైన పార్టీలో కలిశారా అన్న వివరాలు తెలియరాలేదు.
MS Dhoni enjoying the vacation at Dubai. pic.twitter.com/sKO2OmsCMq
— Johns. (@CricCrazyJohns) December 30, 2023
కాగా.. ధోని కొత్త హెయిర్ స్టైల్‌ను చాలా మంది అనుసరిస్తున్నారు. ఇటీవల తన హెయిర్ స్టైల్ పై ధోని మాట్లాడాడు. ఇంతకుముందు తాను యాడ్ ఫిల్మ్‌ల కోసం వెళ్లినప్పుడు 20 నిమిషాల్లో జుట్టు, మేకప్ అన్నీ సిద్ధం చేసుకుని రెడీ అయ్యేవాడినని, ఇప్పుడు ఇందుకోసం గంటా 10 నిమషాల సమయం పడుతున్నాడు. జట్టును పెంచడం కాస్త కష్టమైన పనే అయినప్పటికీ అభిమానులందరూ తన హెయిర్ స్టైల్‌ను ఇష్టపడుతుండడంతో మరికొంత కాలం పాటు దీన్ని ఇలాగే కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.
MS Dhoni with Nupur Sanon. pic.twitter.com/9OWLwUUuFI
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ధోనికి చివరిది అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ధోని స్పందించలేదు. అయితే.. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ దీనిపై మాట్లాడాడు. అతడికి చివరి సీజనో కాదో కేవలం ధోని మాత్రమే చెప్పగలడని అన్నారు. తనకు ఈ విషయం తెలియదన్నాడు. దీని గురించి నేరుగా ధోనినే సమాధానం చెబుతాడని అన్నాడు. ఐపీఎల్ 2023లో ధోని మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీన్ని నుంచి కోలుకుంటున్నాడని విశ్వానాథ్ తెలిపారు. మరో 10 రోజుల్లో అతడు నెట్ ప్రాక్టీస్ సైతం మొదలెట్టే అవకాశం ఉందన్నాడు.