MS Dhoni : ధోనికి కోప‌మొచ్చింది..! ‘నన్నెందుకు చూపిస్తున్నావు.. కొట్టేస్తా మిమ్మ‌ల్ని’

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కేవ‌లం ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు.

MS Dhoni Angry : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కేవ‌లం ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. ఈ సీజ‌నే అత‌డికి చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో అత‌డిని ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. సీఎస్‌కే జ‌ట్టు ఎక్క‌డ మ్యాచ్ ఆడినా ఆయా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్లోమ‌యంగా మారిపోతున్నాయి. ఇక ధోని బ్యాటింగ్ కు వ‌చ్చే స‌మ‌యాల్లో, అత‌డు బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ ధోని నామ‌స్మ‌ర‌ణ‌తో స్టేడియాలు మారుమోగిపోతున్నాయి.

అందుకు త‌గ్గ‌ట్టుగానే కెమెరామెన్లు ధోనిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. అవ‌కాశం దొరికిన ప్ర‌తీసారి ధోనిని బిగ్ స్ర్కీన్ల‌పై చూపించేస్తున్నారు. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో కెప్టెన్ రుతురాజ్ కంటే ధోనినే ఎక్కువ‌గా చూపిస్తుండ‌డాన్ని భార‌త మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం విమ‌ర్శించాడు కూడా.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు.. సంజూశాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్‌

ఇక మంగ‌ళ‌వారం చెపాక్ వేదిక‌గా చెన్నైసూప‌ర్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సైతం కెమెరామెన్ ధోనిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేశాడు. ఓ వైపు రుతురాజ్ గైక్వాడ్‌, శివ‌మ్ దూబెలు దంచికొడుతున్నా కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ధోనినే చూపించాడు. ఆ స‌మ‌యంలో ధోని హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు.

ప‌దే ప‌దే త‌న‌ను చూపించ‌డంతో విసిగిపోయిన ధోని.. చేతిలో ఉన్న బాటిల్‌తో కొట్టేస్తా అన్న‌ట్లుగా రియాక్ష‌న్ ఇచ్చాడు. దెబ్బ‌కు భ‌య‌ప‌డిపోయిన కెమెరామెన్ ధోని నుంచి ఫోక‌స్‌ను డైవ‌ర్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో ధోని సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతి మిగిలిన ఉన్న స‌మ‌యంలో క్రీజులో అడుగుపెట్టాడు. ఆడిన ఒకే ఒక బంతిని ఫోర్‌గా మలిచి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెపాక్ మొత్తం ధోని నినాదాల‌తో మారుమోగిపోయింది.

Ruturaj Gaikwad : రుతురాజ్ సెంచ‌రీ చేస్తే.. సీఎస్‌కే మ్యాచ్ ఓడిపోతుంది..!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 210 ప‌రుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్) శ‌త‌కంతో చెల‌రేగగా, శివ‌మ్ దూబె (27 బంతుల్లో 66) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం మార్క‌స్ స్టోయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్‌) విధ్వంసం సృష్టించ‌గా నికోల‌స్ పూర‌న్ (15 బంతుల్లో 34) మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్యాన్ని లక్నో 19.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ట్రెండింగ్ వార్తలు