MS Dhoni Virat Kohli
MS Dhoni Virat Kohli : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 2-0తో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్ 30వ తేదీన తొలి మ్యాచ్ రాంచీలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు రాంచీకి చేరుకున్నారు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నివాసం కూడా రాంచీలోనే ఉంది. దీంతో గురువారం రాత్రి భారత ప్లేయర్లకు రాంచీలోని తన నివాసంలో మహేంద్ర సింగ్ ధోనీ విందు ఏర్పాటు చేయగా.. వారంతా మర్యాదపూర్వంగా ధోనీ నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ నుంచి ధోనీ ఇంటి వరకు ఆటగాళ్లకు గట్టి భద్రత కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: WPL 2026 Auction: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ప్లేయర్లు వీరే.. అమ్ముడుపోనివారు ఎవరెవరంటే?
రాంచీ అనగానే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకు రావడం సహజం. ఇప్పటికే రాంచీలో ప్రాక్టీస్ చేస్తోన్న భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, పలువురు ప్లేయర్లు గురువారం ధోనీ ఇంటికి వెళ్లారు. ఇక ధోనీ, కోహ్లీల మధ్య బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. డిన్నర్ అనంతరం కోహ్లీని ధోనీ తన సొంత కారులో.. తానే డ్రైవ్ చేసుకుంటూ టీమిండియా బస చేస్తున్న హోటల్ కు తీసుకెళ్లారు. ధోనీ డ్రైవ్ చేస్తుండగా.. ముందు సీట్లో ధోనీ పక్కన కోహ్లీ కూర్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Reunion of the year? 🥺#INDvSA 1st ODI | SUN, 30 NOV, 12:30 PM pic.twitter.com/wu2qSTn30i
— Star Sports (@StarSportsIndia) November 27, 2025
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో రోహిత్, విరాట్ కోహ్లీలు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టు తరపున మరోసారి మైదానంలోకి దిగబోతున్నారు. వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహంచనున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో కోల్పోయిన భారత జట్టు.. వన్డే సిరీస్ లో సత్తాచాటేందుకు పట్టుదలతో ఉంది. వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవటం ద్వారా ప్రస్తుతం తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.
MS Dhoni personally drove his car to drop Virat Kohli back at the hotel after dinner.🥺❤️ pic.twitter.com/sEHdZT1EGt
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 27, 2025