MS Dhoni : ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ధోని.. మిస్ట‌ర్ కూల్ స్పంద‌న ఇదే..

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

MS Dhoni reacts after becoming 11th Indian to be inducted into ICC Hall of Fame

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. 2025 ఏడాదికి గానూ ధోనితో పాటు మ‌రో ఆరుగురు గ్రేమ్ స్మిత్ (ద‌క్షిణాఫ్రికా), హ‌షిమ్‌ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్‌ వెటోరి (న్యూజిలాండ్‌), సారా టేలర్ (మహిళా క్రికెటర్‌, ఇంగ్లాండ్‌), సనా మీర్‌ (మహిళా క్రికెటర్‌, పాకిస్తాన్‌) హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో జాబితాలో చోటు దక్కించుకున్నారు.

2007లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్, 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీల‌ను టీమ్ఇండియాకు అందించాడు మ‌హేంద్రుడు. 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు ధోని. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 17,266 ప‌రుగులు (90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు) సాధించాడు.

RCB : అమ్మ‌కానికి ఆర్‌సీబీ?.. ఐపీఎల్ విజేత‌గా నిల‌వ‌గానే.. షాక్‌లో ఫ్యాన్స్‌? కొత్త య‌జ‌మాని..

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకోవ‌డం పై ధోని స్పందించాడు. ఇది గొప్ప గౌర‌వం అని చెప్పాడు. దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌తో పాటుగా మ‌న పేరును గుర్తుంచుకోవ‌డం ఎప్ప‌టికి నిలిచిపోయే గొప్ప అనుభూతి అని ధోని అన్నాడు.

11వ భార‌త ఆట‌గాడు..

2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 122 మంది క్రికెట‌ర్లకు ఇందులో చోటు ల‌భించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు ద‌క్కించుకున్న 11వ భార‌త ఆట‌గాడిగా ధోని నిలిచాడు. అత‌డి కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్ లు ఈ గౌర‌వాన్ని పొందారు.