MS Dhoni reveals getting keeping lessons from wife Sakshi
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి నాయకత్వంలోనే భారత్ టీ20, వన్డే ప్రపంచకప్‌లను సొంతం చేసుకుంది. ఇక కెప్టెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా బ్యాటర్‌గా ఎన్నో విజయాలను భారత్‌కు అందించాడు. ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటే.. ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజు వదిలి ముందుకు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ధోనికి అతడి భార్య సాక్షి క్రికెట్ రూల్స్ గురించి చెప్పిందట.
ఇటీవల ఓ కార్యకమంలో ధోని పాల్గొన్నాడు. ధోని మాట్లాడుతూ.. తాను, తన భార్య సాక్షి కలిసి క్రికెట్ చూస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ వన్డే మ్యాచ్‌ను చూస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్ వైడ్ వేశాడు. అయితే.. బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వచ్చి బంతిని కొట్టాలని చూశాడు. వెంటనే కీపర్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు.
Gary Kirsten : పాకిస్థాన్‌కో దండంరా అయ్యా.. కోచ్ పదవికి కిర్‌స్టన్ రాజీనామా..
స్టంపౌట్ ఔట్ అంటూ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సమయంలో సాక్షి నాతో ఇలా మాట్లాడింది. ‘అతడు నాటౌట్. కావాలంటే మీరు చూడండి.’ అని చెప్పింది. సాక్షి మళ్లీ మాట్లాడుతూ.. ‘వైడ్ బాల్‌లో స్టంపౌట్ ఉండదు’ అని చెప్పింది.
అప్పుడు నేను చెప్పాను. ‘అలా కాదు.. వైడ్ బాల్‌లో స్టంపౌట్ ఉంటుంది. కానీ నోబాల్ అప్పుడు ఉండదు.’ అని చెప్పాను. సదరు బ్యాటర్ అప్పటికే నడుచుకుంటూ బౌండరీ లైన్ దగ్గరగా వెళ్లాడు. ‘మీకు ఏమీ తెలియదు.. కావాలంటే చూడండి థర్డ్ అంపైర్ అతడిని మళ్లీ వెనక్కి రప్పిస్తాడు.’ అని చెప్పింది. మా సంభాషణ ఇలా జరుగుతుండగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. నెక్ట్స్ బ్యాట్‌మన్ క్రీజులోకి ఇచ్చాడు. అప్పుడు మళ్లీ సాక్షి మాట్లాడుతూ ఏదో తప్పు జరిగింది అని అంది అని ధోని చెప్పాడు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు.. ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టనున్న టీమిండియా.. ఎందుకంటే?
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
That too during stumping 😂😂 https://t.co/L52s1co45n pic.twitter.com/ANSQCBJZNw
— shruti ✿ (@lostshruu) October 27, 2024