Tilak Varmas wrist watch : తిలక్ వర్మకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఎస్కే బౌలర్.. చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలైంది.. వీడియో వైరల్
Tilak Varmas wrist watch : ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జెమీ ఓవర్టన్ వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్ను బలంగా తాకింది. దీంతో వాచ్ రెండు భాగాలుగా విడిపోయింది.
Tilak Varma
- జేమీ ఓవర్టన్ వేసిన బంతికి తిలక్ వర్మ చేతికి గాయం
- రెండు భాగాలుగా విడిపోయిన రిస్ట్ వాచ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Tilak Varmas wrist watch : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో సీఎస్కే జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మకు సీఎస్కే బౌలర్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జెమీ ఓవర్టన్ వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్ను బలంగా తాకింది. దీంతో వాచ్ రెండు ముక్కలైంది. అంతేకాక.. తిలక్ వర్మ చేతికి బంతి తాకడంతో అతను నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఈ ఘటన 12ఓవర్లోని చివరి బంతి వేసిన సమయంలో చోటుచేసుకుంది. అయితే, అదే సమయంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలు కాగా.. ఆ తరువాత తిలక్ వర్మ దానిని సరిచేసి మళ్లీ చేతికి దరించాడు. అదృష్టవశాత్తూ అతను తన గడియారాన్ని చేతికి పెట్టుకోగలిగాడు.
Tilak Verma Whoop Bend broke by Jamie Overtone bowl 🤯
— Sam (@Cricsam01) May 2, 2026
తదుపరి రిప్లేలలో ఆ వాచ్ ధర సుమారు రూ.28వేలు ఖరీదు చేసే WHOOP ఫిట్నెస్ ట్రాకింగ్ బ్యాండ్ అని నిర్ధారణ అయింది. అయితే, ఈ ఘటన తరువాత తిలక్ వర్మ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ సంఘటన జరిగిన కేవలం రెండు బంతుల తరువాత అతను కేవలం ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ ఔట్ అయ్యాడు.
