ముంబై జట్టు గెలవాలి స్వామీ..!! సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. వీడియోలు వైరల్

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. నాల్గో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆదివారం జరగనుంది.

Hardik pandya

Hardik Pandya : ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. గత ఐపీఎల్ సీజన్ వరకు రోహిత్ శర్మ సారథ్యంలో కొనసాగిన ముంబై జట్టు.. 2024 సీజన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతోంది. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై రోహిత్ అభిమానులు, ముంబై జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు.. మైదానంలోనూ హార్ధిక్ పాండ్యాకు రోహిత్ అభిమానుల నుంచి హేళన తప్పడం లేదు. మరోవైపు పాండ్యా సారథ్యంలో వరుసగా ముంబై జట్టు మూడు మ్యాచ్ లు ఓడిపోవటంతో, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించే విషయంపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సోమనాథ్ ఆలయంలో పూజల్లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : IPL 2024 : సొంతగడ్డపై చెలరేగిన హైదరాబాద్.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. నాల్గో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆదివారం (ఏప్రిల్ 7వ తేదీ) వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుండటంతో ఈ మ్యాచ్ లోనైనా ముంబై జట్టు విజయం సాధిస్తుందనే ఆశలో అభిమానులు ఎదురు చూస్తున్నారు. వరుస మ్యాచ్ లలో ఓటమితో హార్దిక్ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ ఢిల్లీతో జరిగే మ్యాచ్ లోనూ ఓడిపోతే హార్దిక్ కెప్టెన్సీ మార్పు ఖాయమనే చెప్పొచ్చు. మరోవైపు ముంబై జట్టుకు ఊరటనిచ్చే అంశం సూర్యకుమార్ యాదవ్ జట్టులో చేరుతున్నాడు. సూర్య కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాటర్ కావడం విశేషం. వరుస ఓటములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబై జట్టుకు సూర్య ఎంట్రీ పెద్ద ఊరటనిచ్చే అంశం.

Also Read : IPL 2024 : ధోనీ బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఏం చేశారో తెలుసా.. వీడియోలు వైరల్

ముంబై జట్టు వరుస ఓటములతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో హార్దిక్ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హార్దిక్ అక్కడి ఆచారాలతో పూజల్లో పాల్గొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు స్వామివారి దయవల్ల ఈసారైనా ముంబై జట్టు విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు