Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దుమ్ములేపుతోంది. సీజన్ ఆరంభంలో తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయిన ఆ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆ తరువాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక బుధవారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టెంది. 16 పాయింట్లు ముంబై ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +1.292గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు స్థానంలో ఉంది.
ఇక ఇప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ముంబైకి ఉంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను ముంబై ఓడించాలి. అదే సమయంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
కనీసం ఆర్‌సీబీ, పంజాబ్‌లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోతే అప్పుడు ముంబై టాప్-2లో ఉండొచ్చు. అయితే.. ఇది అంత సులభం అయిన విషయం కాదు.
టాప్-2లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడితే ఏం జరుగుతుందంటే..?
పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న రెండు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడుతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు తలపడుతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో.. క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఈ లెక్కన టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. అందుకనే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్లు అన్ని కూడా ఇప్పుడు టాప్-2లో నిలిచేందుకు పోటీపడుతున్నాయి.