Arjun Tendulkar
Arjun Tendulkar Trolling: ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) పేరే వినిపిస్తోంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్(IPL)లో తొలి వికెట్‌ను సాధించాడు. ఈ సందర్భంగా పలువురు సెలబెట్రీలు అర్జున్ ను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే.. దీనిపై పలువురు నెటీజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.
2021 సీజన్‌లో ముంబై జట్టు అర్జున్‌ను రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. అయితే.. ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం అతడికి దక్కలేదు. ఐపీఎల్ 2022 మెగావేలంలోనూ రూ.30 లక్షలకు మళ్లీ ముంబై తీసుకుంది. ఈ సారి కూడా అతడికి ఆడే అవకాశం లభించలేదు. రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ సీజన్‌లో కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు అర్జున్. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి పర్వాలేనిపించాడు.
Arjun Tendulkar: ఐపీఎల్‌లో కొడుకు తొలి వికెట్‌పై సచిన టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ ..
అయితే.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వికెట్ తీసి ఐపీఎల్‌లో వికెట్ల ఖాతాను తెరిచాడు. కొందరు అతడి బౌలింగ్ ప్రదర్శనను మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం ట్రోలింగ్ కు దిగారు. ముఖ్యంగా అతడి రనప్, బౌలింగ్ స్పీడు ని తప్పుబడుతున్నారు. అర్జున్ బౌలింగ్ వేగం స్పిన్నర్ల కంటే తక్కువగా ఉందని సెటైర్లు వేస్తున్నారు.
అర్జున్ పేస్ బౌలింగ్ వేయడం కంటే స్పిన్ వేయడం ఉత్తమం అని కామెంట్లు పెడుతున్నారు. గంటకు 130 కి.మీ కంటే తక్కువ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్న వ్యక్తిని ఇంతలా ఎందుకు పొడుగుతున్నారని మరొకరు ప్రశ్నించారు. అర్జున్ టెండూల్కర్ మ్యాచ్‌లో ఓ బంతిని 107.2కి.మీ వేగంతో వేయడం ట్రోలింగ్‌కు కారణం. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 2.5 ఓవర్లు వేసిన అర్జున్ 19 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.