Musheer Khan slams 2nd century for India at U19 World Cup 2024
Under-19 World Cup 2024 : సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత్ బ్యాటర్ ముషీర్ ఖాన్ ఇరగదీశాడు. రెండు సెంచరీలతో సత్తా చాటాడు. ఈ రోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు బాదాడు. అంతకుముందు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీ(118) కొట్టాడు. అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ముషీర్ ఖాన్ కంటే ముందు శిఖర్ ధవన్ ఈ ఘనత సాధించాడు.
తాజా అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ముషీర్ ఖాన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ 18 ఏళ్ల యువ బ్యాటర్ 81.25 యావరేజ్‌తో 325 పరుగులు చేశాడు. సింగిల్ ఎడిషన్‌లో ఇండియా బ్యాటర్ చేసిన 7వ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇది. 2004లో 505 పరుగులు చేసిన శిఖర్ ధవన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముషీర్ ఖాన్ ఇదే జోరు కొనసాగిస్తే ధవన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది.
ముషీర్ ఖాన్ ఫ్యామిలీ డబుల్ ధమాకా
ముషీర్ ఖాన్ సెంచరీ అతడి ఫ్యామిలీలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఎందుకంటే ముషీర్ అన్నయ్య సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లండ్ తో జరిగే రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు. ఈ హ్యాపీ న్యూస్ అంది 24 గంటలు గడవకముందే ముషీర్ సెంచరీతో మెరిశాడు. దీంతో ముంబైలోని ముషీర్ ఫ్యామిలీలో సంబరాల్లో ముగినిపోయింది.
Also Read: టీమ్ఇండియాలో చోటు దక్కిన తరువాత.. సర్ఫరాజ్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే..
ఆదర్శ్ సింగ్ హాఫ్ సెంచరీ
ఇక మ్యాచ్ విషయానికి కొస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యువ భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఉదయ్ శరణ్(34) ఫర్వాలేదనిపించాడు. ఆరవెల్లి అవినాశ్(17), పియాన్షు(10), సచిన్ దాస్ (15), అర్షిన్ కులకర్ణి (9), మురుగన్ అభిషేక్(4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టాడు.
Second HUNDRED in the #U19WorldCup for Musheer Khan! ?
He’s in supreme form with the bat ??
Follow the match ▶️ https://t.co/UdOH802Y4s#BoysInBlue | #INDvNZ pic.twitter.com/8cDG0b6iOx
— BCCI (@BCCI) January 30, 2024