×
Ad

Mushfiqur Rahim : చ‌రిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్.. వందో టెస్టులో 100 ప‌రుగులు.. ఇంకా ఈ జాబితాలో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలుసా?

బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Mushfiqur Rahim Century in his 100th test overall 11th player

Mushfiqur Rahim : బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. త‌న వందో టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ చేశాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఢాకా వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. జోర్డాన్ నీల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 195 బంతుల్లో ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) మూడు అంకెల స్కోరు సాధించాడు.

AUS vs ENG : ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ స‌వాల్‌.. తొలి టెస్టుకు రెండు రోజుల ముందే..

ఇక ఓవ‌రాల్‌గా వందో టెస్టులో వంద ప‌రుగులు చేసిన 11వ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. రికీ పాంటింగ్‌, గ్రేమ్ స్మిత్, డేవిడ్ వార్న‌ర్ వంటి ఆట‌గాళ్లు ఉన్న జాబితాలో ముష్ఫికర్ రహీమ్ చోటు ద‌క్కించుకున్నాడు. ఇక టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ కు ఇది 13వ సెంచ‌రీ.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ గాయంపై బీసీసీఐ కీల‌క అప్‌డేట్‌.. జ‌ట్టుతో పాటు గౌహ‌తి వెళ్తాడు గానీ..

వందో టెస్టు మ్యాచ్‌లో వంద ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* కాలిన్ కౌడ్రీ (ఇంగ్లాండ్‌) – 104 ప‌రుగులు (1968లో ఆస్ట్రేలియా పై )
* జావేద్ మియాందాద్ (పాకిస్తాన్‌) – 145 ప‌రుగులు (1989లో భార‌త్‌పై)
* గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్‌) – 149 ప‌రుగులు (1990లో ఇంగ్లాండ్ పై)
* అలెక్ స్టీవర్ట్ (ఇంగ్లాండ్‌) – 105 ప‌రుగులు (2000లో వెస్టిండీస్‌)
* ఇంజామామ్-ఉల్-హక్ (పాకిస్తాన్‌) – 184 నాటౌట్ (2005లో భార‌త్ పై)
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 120 & 143* (రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శ‌త‌కాలు) (2006లో ద‌క్షిణాఫ్రికాపై)

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు భారీ షాక్‌.. వ‌న్డేల్లో చేజారిన..

* గ్రేమ్ స్మిత్ (ద‌క్షిణాఫ్రికా) – 131 ప‌రుగులు (2012లో ఇంగ్లాండ్ పై)
* హషీమ్ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా) – 134 ప‌రుగులు (2017లో శ్రీలంక‌పై)
* జోరూట్ (ఇంగ్లాండ్‌) – 218 ప‌రుగులు (2021లో భార‌త్‌పై)
* డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – 200 ప‌రుగులు (2022లో ఆస్ట్రేలియాపై)