×
Ad

Thaman : త‌మ‌న్ బ్యాటింగ్ స్కిల్స్‌కు స‌చిన్ ఫిదా.. త్వ‌ర‌లోని ఇద్ద‌రూ క‌లిసి.. ట్వీట్ వైర‌ల్‌..

సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ (Thaman) క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ఒకే విమానంలో ప్ర‌యాణించారు.

Music director SS Thaman Tweet he might work with Sachin Tendulker soon

Thaman : సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ త‌మ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. తెలుగు, త‌మిళంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్నారు. ఇక ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. తాను చేసే సినిమాల‌కు సంబంధించిన మ్యూజిక్ అప్‌డేట్‌ల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా త‌మ‌న్ (Thaman) సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. విమానంలో క్రికెట్ దేవుడిని క‌లుసుకున్నాన‌ని ట్వీట్ చేశాడు. ఆయ‌న‌తో దిగిన ఫోటోను షేర్ చేసుకున్నాడు. డ‌ల్లాస్ నుంచి దుబాయ్ వెలుతుండ‌గా ఇది జ‌రిగింద‌ని చెప్పుకొచ్చాడు. అంతేకాదండోయ్‌.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయొచ్చున‌ని తెలిపాడు.

Deepak Chahar : బిగ్‌బాస్ షోలో దీప‌క్ చాహర్‌.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ..! ప్రొమో అదుర్స్‌..

‘క్రికెట్ దేవుడు, దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌తో క‌లిసి డల్లాస్‌ నుంచి దుబాయ్‌ వరకు ప్రయాణం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ స‌మ‌యంలో మేమిద్దం ఎన్నో విష‌యాల గురించి మాట్లాడుకున్నాం. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)లో నేను ఆడిన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోల‌ను చూపించాను. అందుకు నీ బ్యాటింగ్ స్పీడ్ చాలా బాగుంద‌ని అని స‌చిన్ చెప్పారు.’ అని త‌మ‌న్ రాసుకొచ్చాడు.

Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావ‌ని అడిగితే.. ?

అయితే.. ఆఖ‌రిలో మాత్రం త్వ‌ర‌లోనే కలిసి పని చేయొచ్చు అని తెలిపాడు. దీంతో నెటిజ‌న్లు ప్రశ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సచిన్‌ సినిమాల్లో నటించనున్నారా? లేక మైదానంలో సచిన్‌తో క‌లిసి త‌మ‌న్‌ బ్యాటింగ్ చేస్తాడా? అని కామెంట్లు చేస్తున్నారు.