Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ?
విజయం సాధించిన అనంతరం హికరు నకముర (Hikaru Nakamura) ప్రత్యర్థి రాజును ప్రేక్షకుల్లోకి విసిరివేశాడు.

Checkmate Why Hikaru Nakamura threw Gukesh king into the crowd after winning
Hikaru Nakamura : ఆర్లింగ్టన్‌లోని ఎస్పోర్ట్స్ స్టేడియంలో భారత్, యూఎస్‌ల మధ్య ఎగ్జిబిషన్ చెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికరు నకముర (Hikaru Nakamura ) భారత స్టార్ ప్లేయర్ డి.గుకేశ్ పై విజయం సాధించాడు. ఆ తరువాత చేసిన పనితో నకముర తీవ్ర విమర్శల పాలు అయ్యాడు.
మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత నకముర.. గుకేశ్ పావు(రాజును) ప్రేక్షకుల్లోకి విసిరివేశాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారు విస్మయానికి లోనైయ్యారు. షాక్‌కు గురైన గుకేశ్ అలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నకముర చేసిన పనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడి దురుసు ప్రవర్తన ఏ మాత్రం అమోదయోగ్యాం కాదని అంటున్నారు.
HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru
What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ
— Chess.com (@chesscom) October 5, 2025
ఇక తాను చేసిన పనిపై నకముర స్పందించాడు. తాను గుకేశ్ పై విజయం సాధించానని, ఇది అభిమానులకు తెలియాలనే అలా చేశానన్నాడు. వారి నుంచి పెద్ద ఎత్తున హర్షద్వానాలను వినాలని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ నిర్వాహకులు ఆటగాళ్లను ఈ తరహా చర్యలకు ప్రోత్సహించారని, ఇది కేవలం వినోదం కోసమే చేసినట్లుగా తెలిపాడు. ఈవెంట్‌కు కొత్తదనాన్ని తీసుకురావడానికే ఇలా చేశామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు.
0-5 తేడాతో..
ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్‌లో అమెరికా చేతిలో భారత్ 0-5 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అర్జున్ ఇరిగేశి పై ఫాబియానో కరువానా గెలవగా, రెండో మ్యాచ్‌లో ఇథాన్ వాజ్‌పై టానిటోలువా గెలుపొందారు.
IND w Vs PAK w : మునీబా అలీ వివాదాస్పద రనౌట్..! ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయ్..
ఆ తరువాత దివ్య దేశ్‌ముఖ్ అంచనాలను అందుకోలేకపోయింది. కారిస్ యిప్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో అమెరికా 3-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నాలుగో మ్యాచ్‌లో లవీ రోజ్‌మన్ చేతిలో సాగర్ షా ఐదో గేమ్‌లో హికరు నకముర పై గుకేశ్ ఓడిపోయారు. దీంతో 5-0తో అమెరికా గెలుపొందింది.