IND w Vs PAK w : రిచా ఎంత ప‌ని చేస్తివి.. పాపం పాక్ ప్లేయ‌ర్లు.. క్యాచ్ అందుకునేందుకు వెళ్లి.. వీడియో వైర‌ల్‌

భార‌త్‌తో మ్యాచ్‌లో (IND w Vs PAK w) ఓ క్యాచ్‌ను అందుకునే క్ర‌మంలో పాక్ ప్లేయ‌ర్లు ఒక‌రినొక‌రు ఢీ కొన్నారు.

IND w Vs PAK w : రిచా ఎంత ప‌ని చేస్తివి.. పాపం పాక్ ప్లేయ‌ర్లు.. క్యాచ్ అందుకునేందుకు వెళ్లి.. వీడియో వైర‌ల్‌

Womens ODI World Cup 2025 IND w Vs PAK w Pakistan Fielders Collide Miss Catch

Updated On : October 6, 2025 / 10:42 AM IST

IND w Vs PAK w : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా భార‌త్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ కోసం పాక్ వికెట్ కీప‌ర్‌తో పాటు ఓ ఫీల్డ‌ర్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. క‌ట్ చేస్తే చాలా ఈజీ క్యాచ్‌ను ఇద్ద‌రూ మిస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భార‌త ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను డ‌యానా బేగ్ వేసింది. స్ట్రైకింగ్‌లో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిచా ఘోష్ ఉంది. తొలి బంతిని బౌండ‌రీ త‌ర‌లించిన రిచా రెండో బంతికి రెండు ప‌రుగులు తీసింది. దీంతో మూడో బంతిని డ‌యానా షార్ట్ బాల్‌గా సంధించింది. భారీ షాట్ ఆడేందుకు రిచా య‌త్నించ‌గా.. మిస్ టైమింగ్ కావ‌డంతో బంతి గాల్లోకి లేచింది.

IND w Vs PAK w : మునీబా అలీ వివాదాస్పద రనౌట్‌..! ఐసీసీ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయ్‌..

పాక్‌ వికెట్ కీపర్ సిద్రా నవాజ్, బ్యాక్‌వర్డ్ పాయింట్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న‌ నటాలియా పెర్వైజ్ లు ఇద్ద‌రూ కూడా క్యాచ్ కోసం ప్ర‌య‌త్నించారు. ఇద్ద‌రూ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. ఇద్ద‌రూ ఢీ కొన‌డంతో సిద్రా చేతిలో ప‌డిన బంతి బౌన్స్ అయి కింద‌ప‌డింది. ఈజీ క్యాచ్ మిస్సైన‌ప్ప‌టికి అదృష్ట‌వ‌శాత్తు ఇద్ద‌రికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ స‌మ‌యంలో రిచా సింగిల్ తీసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ మ్యాచ్ (IND w Vs PAK w) విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 247 ర‌న్స్ చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో హర్లీన్‌ డియోల్‌ (46; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిచా ఘోష్‌ (35 నాటౌట్‌; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జెమీమా రోడిక్స్ (32; 37 బంతుల్లో 5 ఫోర్లు), ప్రతీక రావల్‌ (31; 37 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. పాక్ బౌల‌ర్ల‌లో డయానా బేగ్ నాలుగు వికెట్లు తీయ‌గా..ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.

Fatima sana : అందుకే భార‌త్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ ఫాతిమా స‌నా హాట్ కామెంట్స్‌..

ఆ త‌రువాత 248 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌ 43 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్ 88 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. పాక్ బ్యాట‌ర్ల‌లో సిద్రా అమిన్‌ (81) పోరాడింది. మిగిలిన వాళ్లు విఫ‌లం అయ్యారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో క్రాంతి గౌడ్‌, దీప్తి శ‌ర్మ‌లు చెరో మూడు వికెట్లు తీయ‌గా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది.