×
Ad

Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావ‌ని అడిగితే.. ?

విజ‌యం సాధించిన అనంత‌రం హిక‌రు న‌క‌ముర (Hikaru Nakamura) ప్ర‌త్య‌ర్థి రాజును ప్రేక్ష‌కుల్లోకి విసిరివేశాడు.

Checkmate Why Hikaru Nakamura threw Gukesh king into the crowd after winning

Hikaru Nakamura : ఆర్లింగ్టన్‌లోని ఎస్పోర్ట్స్ స్టేడియంలో భార‌త్, యూఎస్‌ల మ‌ధ్య ఎగ్జిబిష‌న్ చెస్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో అమెరికా గ్రాండ్ మాస్ట‌ర్ హిక‌రు న‌క‌ముర (Hikaru Nakamura ) భార‌త స్టార్ ప్లేయ‌ర్ డి.గుకేశ్ పై విజ‌యం సాధించాడు. ఆ త‌రువాత చేసిన ప‌నితో న‌క‌ముర తీవ్ర విమ‌ర్శ‌ల పాలు అయ్యాడు.

మ్యాచ్‌లో విజ‌యం సాధించిన త‌రువాత న‌క‌ముర‌.. గుకేశ్ పావు(రాజును) ప్రేక్ష‌కుల్లోకి విసిరివేశాడు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డ ఉన్న వారు విస్మ‌యానికి లోనైయ్యారు. షాక్‌కు గురైన గుకేశ్ అలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌క‌ముర చేసిన ప‌నిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అత‌డి దురుసు ప్ర‌వ‌ర్త‌న ఏ మాత్రం అమోద‌యోగ్యాం కాద‌ని అంటున్నారు.

IND w Vs PAK w : రిచా ఎంత ప‌ని చేస్తివి.. పాపం పాక్ ప్లేయ‌ర్లు.. క్యాచ్ అందుకునేందుకు వెళ్లి.. వీడియో వైర‌ల్‌

ఇక తాను చేసిన ప‌నిపై న‌క‌ముర స్పందించాడు. తాను గుకేశ్ పై విజ‌యం సాధించాన‌ని, ఇది అభిమానుల‌కు తెలియాల‌నే అలా చేశాన‌న్నాడు. వారి నుంచి పెద్ద ఎత్తున హ‌ర్ష‌ద్వానాల‌ను వినాల‌ని అనుకున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ నిర్వాహ‌కులు ఆట‌గాళ్ల‌ను ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు ప్రోత్స‌హించార‌ని, ఇది కేవలం వినోదం కోస‌మే చేసిన‌ట్లుగా తెలిపాడు. ఈవెంట్‌కు కొత్త‌ద‌నాన్ని తీసుకురావ‌డానికే ఇలా చేశామ‌ని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేద‌న్నాడు.

0-5 తేడాతో..

ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్‌లో అమెరికా చేతిలో భార‌త్ 0-5 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అర్జున్ ఇరిగేశి పై ఫాబియానో క‌రువానా గెల‌వ‌గా, రెండో మ్యాచ్‌లో ఇథాన్ వాజ్‌పై టానిటోలువా గెలుపొందారు.

IND w Vs PAK w : మునీబా అలీ వివాదాస్పద రనౌట్‌..! ఐసీసీ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయ్‌..

ఆ త‌రువాత దివ్య దేశ్‌ముఖ్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. కారిస్ యిప్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. దీంతో అమెరికా 3-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నాలుగో మ్యాచ్‌లో ల‌వీ రోజ్‌మ‌న్ చేతిలో సాగ‌ర్ షా ఐదో గేమ్‌లో హిక‌రు న‌క‌ముర పై గుకేశ్ ఓడిపోయారు. దీంతో 5-0తో అమెరికా గెలుపొందింది.