Deepak Chahar : బిగ్‌బాస్ షోలో దీప‌క్ చాహర్‌.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ..! ప్రొమో అదుర్స్‌..

స‌డెన్‌గా హిందీ బిగ్‌బాస్ షోలో క‌నిపించాడు దీప‌క్ చాహ‌ర్ (Deepak Chahar)

Deepak Chahar : బిగ్‌బాస్ షోలో దీప‌క్ చాహర్‌.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ..! ప్రొమో అదుర్స్‌..

Deepak Chahar Spotted With Salman Khan In Bigg Boss

Updated On : October 6, 2025 / 12:03 PM IST

Deepak Chahar : టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు భార‌త టీ20 జ‌ట్టులో రెగ్యుల‌ర్ స‌భ్యుడిగా ఉన్నాడు. అయితే.. గాయాలు, ఫామ్ లేమీతో జ‌ట్టుకు దూరం అయ్యాడు. గ‌త రెండేళ్లుగా ఈ ఆట‌గాడు ఐపీఎల్‌లో మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. స‌డెన్‌గా ఈ స్టార్ ఆట‌గాడు హిందీ బిగ్‌బాస్ షోలో క‌నిపించాడు. ప్ర‌స్తుతం హిందీలో బిగ్‌బాస్ సీజ‌న్ 19 న‌డుస్తోంది. స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావ‌ని అడిగితే.. ?

ఈ ప్రొమోలో దీప‌క్ చాహ‌ర్‌ను హోస్ట్ స‌ల్మాన్ స్టేజీపైకి ఆహ్వానించాడు. ఈ సీజ‌న్‌లో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవ‌రో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎవ‌రో తెలిసిపోయింది. మీ కుటుంబం అంతా ఈ షోను చూస్తుంటుంది క‌దా అని దీప‌క్‌ను స‌ల్మాన్‌ను అడిగాడు.

క్రికెట్ కంటే ఈ బిగ్‌బాస్ షో చాలా క‌ష్టం అని దీప‌క్ చాహ‌ర్ స‌మాధానం ఇచ్చాడు. ఎందుకంటే ఇంటి లోప‌ల మీ శ‌త్రువులు ఎవ‌రో, మిత్రులు ఎవ‌రో తెలియ‌దు. నేను లోప‌లికి వెళితే అంతా గ‌మ‌నించి ఆ త‌రువాత నిర్ణ‌యం తీసుకున్నాను. గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి అని దీప‌క్ అన్నాడు.

అయితే.. ఇక్క‌డ ఓ చిన్న ట్విస్ట్ ఉందండోయ్‌.. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది దీప‌క్ చాహ‌ర్ కాదు. ఆయ‌న సోద‌రి మాల‌తి చాహ‌ర్‌. ఆమె ఈ సీజ‌న్‌లో రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెడుతోంది.

Fatima sana : అందుకే భార‌త్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ ఫాతిమా స‌నా హాట్ కామెంట్స్‌..

మాల‌తీ చాహర్.. ఓ మోడ‌ల్. కొన్ని మ్యూజిక్ ఆల్బ‌మ్స్‌తో పాటు కొన్ని సినిమాల్లోనూ న‌టించింది. ఆమెకు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.