Neeraj chopra enter into World Athletics Championships 2025 final
World Athletics Championships 2025 : భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. టోక్యో నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫికేసన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. క్వాలిఫికేషన్ మార్క్ 84.50 దాటేశాడు. తన తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్(World Athletics Championships 2025)కు అర్హత సాధించాడు.
భారత మరో జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్-బిలో పోటీపడ్డ అతడు తన రెండో ప్రయత్నంలో 83.67 మీటర్లు దూరం బళ్లెంను విసిరి అర్హత సాధించాడు. అతడు పదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్, విజయ్ సింగ్‌లు క్వాలిఫికేషన్ మార్క్‌ను అందుకోలేకపోవడంతో ఫైనల్‌కు చేరుకోలేదు.
పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ అర్షద్ నదీమ్ సైతం ఫైనల్‌కు చేరుకున్నాడు. తన తొలి రెండు ప్రయత్నాలలో 74.17 మీటర్లు, 76.99 మీటర్లు మాత్రమే ఈటెను విసిరిన నదీప్.. ఆఖరి ప్రయత్నంలో 85.28 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా.. పారిస్ ఒలింపిక్స్ తరువాత నదీమ్, చోప్రాలు పోటీపడనుండడం ఇదే తొలిసారి.
అండర్సన్ పీటర్స్ (89.53, జర్మనీ), జులియన్ వెబెర్(87.21 మీటర్లు,జర్మనీ), జులియన్ ఎగో (85.96 మీటర్లు, కెన్యా) డేవిడ్ వేగ్నర్ (85.67 వీటర్లు, పోలాండ్) లు నీరజ్ చోప్రా కంటే ముందు నిలిచారు.
స్వర్ణం గెలిస్తే చరిత్రే..
నీరజ్ చోప్రా ఈ టోర్నీలో గోల్డ్‌మెడల్ గెలిస్తే.. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండు స్వర్ణాలు గెలిచిన మూడో జావెలిన్ త్రోయర్‌గా, తొలి భారత అథ్లెట్‌గా నిలుస్తాడు. గతంలో జాన్ జీలెంజీ(1993, 1995), జర్మనీ ప్లేయర్ జోహన్నెస్ వెట్టెర్(2019, 2022) ఈ ఘనతను సాధించారు.
Mohsin Naqvi : ఆసియాకప్ నుంచి మేం ఎందుకు వైదొలగలేదు అంటే.. పీసీబీ చీఫ్ నఖ్వి చెప్పిన సాకులు ఇవే..
నేడే ఫైనల్..
గురువారం ఫైనల్ జరగనుంది. 12 మంది స్వర్ణం కోసం పోటీపడనున్నారు. వెబర్, పీటర్స్, నదీమ్‌ల నుంచి నీరజ్ చోప్రాలకు గట్టి పోటీ తప్పదు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.
ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ ఫైనల్‌ను జియో హాట్‌స్టార్ యాప్, వైబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.