Salman Ali Agha : భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్.. ‘మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరినైనా ఓడిస్తాం..’
యూఏఈ పై విజయం పై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) స్పందించాడు.

Salman Ali Agha comments after Pakistan beat United Arab Emirates
Salman Ali Agha : ఆసియాకప్ 2025లో సూపర్4లో అడుగుపెట్టాలంటే యూఏఈ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ గ్రూప్-ఏ నుంచి రెండో జట్టుగా సూపర్4కి వెళ్లింది. ఇక సూపర్ 4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21న) భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
కాగా.. యూఏఈతో మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడాడు. విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. అయితే.. మిడిల్ ఓవర్లలో తమ బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉందన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేయలేదన్నాడు.
Mohsin Naqvi : ఆసియాకప్ నుంచి మేం ఎందుకు వైదొలగలేదు అంటే.. పీసీబీ చీఫ్ నఖ్వి చెప్పిన సాకులు ఇవే..
తాము బాగా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170 నుంచి 180 పరుగులు సాధించేవాళ్లమని చెప్పుకొచ్చాడు. ఇక బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు. షాహీన్ అఫ్రిది మ్యాచ్ విన్నర్ అని కితాబు ఇచ్చాడు. అతడి బ్యాటింగ్ ఎంతో మెరుగుపడిందన్నాడు. ఇక అబ్రార్ అద్భుత ఆడగాడని తమని తిరిగి పోటీలోకి తీసుకువచ్చాడని చెప్పుకొచ్చాడు. తాము ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాము అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఏ జట్టునైనా ఓడిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఫకార్ జమాన్(50) అర్ధశతకం బాదాడు. షాహిన్ షా అఫ్రిది(14 బంతుల్లో 29 నాటౌట్) వేగంగా ఆడాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ నాలుగు వికెట్లు తీయగా.. సిమ్రంజిత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పరాషర్ ఒక వికెట్ సాధించాడు.
అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. యూఏఈ బ్యాటర్లలో రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాషర్ (20) లు పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా లు ఒక్కొ వికెట్ తీశారు.