×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం నేపాల్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. రోహిత్ పౌడెల్ నాయ‌క‌త్వంలోనే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 (T20 World Cup 2026) కోసం నేపాల్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Nepal announced 15 member squad for T20 World Cup 2026 and Rohit Paudel To Lead

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు నేపాల్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌
  • రోహిత్ పౌడెల్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి
  • ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఇటలీ, వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ సిలో నేపాల్

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం నేపాల్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన బృందానికి రోహిత్ పౌడెల్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. 23 ఏళ్ల ఈ ఆల్‌రౌండ‌ర్ నేపాల్ విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. జ‌ట్టుకు అవ‌స‌రం అయిన స‌మ‌యంలో బ్యాట్‌తో రాణిస్తూ, ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ త‌న ప్ర‌శాంత‌న‌ను కోల్పోకుండా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డికి డిప్యూటీగా దీపేంద్ర సింగ్‌ను నియ‌మించారు.

ఇక స్పిన్ విభాగానికి సందీప్ లామిచానే నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ టీ20 లీగులు ఆడిన అనుభ‌వం ఉంది. దీపేంద్ర, గుల్షన్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కామి లు ఆల్‌రౌండ‌ర్ల విభాగంలో చోటు ద‌క్కించుకున్నారు. వీరు జ‌ట్టుకు స‌మతూకాన్ని తెస్తారు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆట‌గాడికి చోటు..

2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగిన నేపాల్ నాలుగు మ్యాచ్‌లు ఆడ‌గా ఒక్క మ్యాచ్‌లోనూ గెల‌వ‌లేక‌పోయింది. అయితే ఈ సారి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఆరాట ప‌డుతోంది.

Shreyas Iyer : రీఎంట్రీలో ఇర‌గ‌దీసిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు

ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఇటలీ, వెస్టిండీస్‌లతో పాటు నేపాల్ గ్రూప్ సిలో ఉంది. నేపాల్ త‌మ తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వరి 8న వాఖండే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

టీ20 ప్రపంచ కప్ కోసం నేపాల్ జట్టు ఇదే..

రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.