Viral Video : సూప‌ర్ హీరోవా ఏంటి! అమాంతం గాల్లోకి ఎగిరి.. సిక్స్ వెళ్లే బంతిని ఆపి.. ర‌నౌట్

క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్య‌మైన‌ది అన్న సంగ‌తి తెలిసిందే.

Nepal Cricketer Effort To Convert Certain Six Into Run Out

క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్య‌మైన‌ది అన్న సంగ‌తి తెలిసిందే. ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే ఈ మూడు విభాగాల్లో త‌ప్ప‌కుండా రాణించాల్సిందే. ఇక క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే ఓ నానుడి సైతం ఉంది. ఫీల్డింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సిక్స్ వెళ్లే బంతిని అడ్డుకోవ‌డంతో పాటు బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేశాడు. ఈ ఘ‌ట‌న నేపాల్‌లో జ‌రుగుతున్న ట్రై సిరీస్‌లో చోటు చేసుకుంది.

ట్రై సిరీస్‌లో భాగంగా నెద‌ర్లాండ్స్‌, నేపాల్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. 120 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. మాక్స్ ఓడౌడ్ 31 పరుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. నేపాల్ బౌల‌ర్ల‌లో ప్రతిస్ మూడు వికెట్ల‌తో రాణించాడు. అనంత‌రం ల‌క్ష్యాన్ని నేపాల్ 15.2 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 46 పరుగులు చేయగా, గుల్సన్ ఝా 38 పరుగులతో రాణించాడు.

Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌

కాగా..నెద‌ర్లాండ్స్ ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న క్రికెట్ ప్రేమికుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌ను దీపేందర్ సింగ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని పుల్‌టాస్‌గా వేయ‌గా నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లాంగ్ ఆన్‌వైపు షాట్ ఆడాడు. బంతి సిక్స్ వెళ్లేలా క‌నిపించింది. అయితే.. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న కుశాల్ భుర్టెల్ అమాంతం గాల్లోకి ఎగిరి.. బంతి సిక్స్‌గా వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు. బంతిని మైదానంలోకి ప‌డేలా చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డు కింద‌ప‌డ్డాడు.

అయిన‌ప్ప‌టికీ వెంట‌నే లేచీ బంతిని అందుకుని వికెట్ కీప‌ర్ ఆసిఫ్ షేక్ వైపు విసిరాడు. బ్యాట‌ర్లు రెండో ప‌రుగు ప్ర‌య‌త్నించ‌డంతో కింగ్మా నాలుగు ప‌రుగుల వ్య‌క్తి గ‌త స్కోరు వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. సూప‌ర్ హీరోలా బాల్‌ను ఆపావ‌ని అంటున్నారు.

Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ మిస్ ? మ‌రో 97 ప‌రుగులు చేసుంటేనా?

ట్రెండింగ్ వార్తలు